AP Weather: ఏపీకి మరో అల్పపీడన గండం… మరోసారి ఆ జిల్లాలకే ముప్పు..

ఏపీని వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది.

AP Weather: ఏపీకి మరో అల్పపీడన గండం... మరోసారి ఆ జిల్లాలకే ముప్పు..
Andhra Rains
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2021 | 10:00 PM

ఏపీని వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారనుంది. నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతాలపైన ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ద్రోణి విస్తరించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26న తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే 26, 27న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో.. 27న కడప జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కడప, తూర్పుగోదావరి సహా మరికొన్ని జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.

ఏపీలో మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తుండటంతో.. రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. డిసెంబర్‌ 15 వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలు, వరదలతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు వణికిపోతున్నాయి. మళ్లీ వర్షాలు పడతాయనే అంచనాతో అందరిలో టెన్షన్ మొదలైంది.

ఇప్పటికీ వరదలు కారణంగా.. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు, తిరుపతి నగరాలపై వాన ప్రభావం అధికంగా కనిపించింది. ఇక తిరుపతిలో అయితే చరిత్రో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని స్థానికులు అంటున్నారు. భారీ వర్షాల ప్రభావం తిరుమల పైనా కనిపించింది. వైకుంఠం కాంప్లెక్స్ లోకి కూడా వరద నీరు చేరింది. ఘాట్ రోట్లను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నెల్లూరు నగరంలోనూ అదే పరిస్థితి కనిపించింది. రోడ్లన్నీ చెరువులు అయ్యాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి.

ఇంకా ఆ భయం నుంచి అక్కడి ప్రజలు తేరుకోక ముందే మరో హెచ్చరిక భయపెడతోంది. తాజా అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అపార నష్టం సంభవించవచ్చని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతినకుండా, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అధికారులు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. వానలకు ఇబ్బంది పడకుండా నిత్యవసర సరుకులు తెచ్చుకొని ఇంటిలో నిల్వ చేసుకుంటే మంచిది. ముఖ్యమైన పనులు ఉంటే ఈ నవంబర్ 26 లోపు పూర్తి చేసుకోండి. వరద నుంచి ఉపసమనం ఉండదు. చిన్న వర్షానికే వరద వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: వరదలో కొట్టుకుపోయిన పెనివిటి కోసం కోసం ఓ మహిళ వెతుకులాట.. కన్నీరుమున్నీరు..

గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్