Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Floods: వరదలో కొట్టుకుపోయిన పెనివిటి కోసం కోసం ఓ మహిళ వెతుకులాట.. కన్నీరుమున్నీరు..

నా భర్త ఎక్కడున్నాడు..? ఏమై పోయాడు..? ఎవరైనా చెప్పండి..! అంటూ ఓ మహిళ నడిరోడ్డు మీద అందర్నీ అడుగుతూ కన్నీటిపర్యతం అవ్వడం అందర్నీ కలిచివేస్తోంది.

AP Floods: వరదలో కొట్టుకుపోయిన పెనివిటి కోసం కోసం ఓ మహిళ వెతుకులాట.. కన్నీరుమున్నీరు..
Woman Searching For Husband
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2021 | 7:00 PM

వరదలో కొట్టుకుపోయిన భర్త కోసం ఓ మహిళ తన కూతురుతో కలిసి వెతుకుతోంది. గత నాలుగైదు రోజులుగా ఆమె వెతుకుతూనే ఉంది. కానీ భర్త జాడ తెలియడం లేదు. ఏమైపోయాడో ఎవ్వరికి తెలియదు. ఎక్కడైనా బ్రతికే ఉంటాడని చిన్న ఆశ.

అసలేం జరిగింది…

ఓ వైపు వరద ఉధృతి…మరోవైపు ఇంటికి చేరాలనే తపన. ఇంకా 10 అడుగులు వేస్తే ఇళ్లొస్తుంది. ఇదే కాన్ఫిడెంట్స్‌తో షేక్‌ రషీద్‌ ముందుకు కదిలాడు. అందరూ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. రహదారిపై చిన్నగుంత కనిపించకపోవడంతో అందులో అడుగువేశాడు షేక్‌ రషీద్‌. అంతే వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు.

ఈనెల 19న కడపజిల్లాలో చెయ్యేరు నది ఉప్పొంగి..ఊళ్లకు ఊళ్లే తుడిచుకుపెట్టుకుపోయాయి. చెయ్యేరు ఉగ్రరూపానికి గుండ్లూరు గ్రామం కూడా కొట్టుకుపోయింది. ఊరు మొత్తం ఉప్పెనలో చిక్కుకుంది. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన అయేషా అనే మహిళ భర్త షేక్‌ రషీద్‌…వరద ప్రవాహంలో ఇంటికి వస్తూ గల్లంతయ్యాడు.

నా భర్త ఎక్కడున్నాడు..? ఏమై పోయాడు..? ఎవరైనా చెప్పండి..! అంటూ ఆమె నడిరోడ్డు మీద అందర్నీ అడుగుతూ కన్నీటిపర్యతం అవ్వడం అందర్నీ కలిచివేస్తోంది. అయేషా తన కన్నకూతురితో కలిసి భర్త కోసం గాలిస్తోంది. అధికారులు ఎక్కడ కనిపించినా.. కాళ్లమీద పడి భర్త ఆచూకీ తెలుపమని వేడుకుంటోంది. ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరికి తానే స్వయంగా చెయ్యేరు నది వరదనీటిలో గాలిస్తోంది అయేషా. గత నాలుగైదు రోజులుగా ఆమె అలా ఏడుస్తూనే ఉంది. నదిచుట్టూ గాలిస్తూనే ఉంది. వరదకు కొట్టుకుపోయిన భర్త..ఎక్కడైనా అదృష్టవశాత్తూ బతికున్నాడేమోననే చిన్న ఆశ. ఒకవేళ చనిపోయి ఉంటే ఎక్కడో ఒకచోట డెడ్‌బాడీ అయినా లభిస్తుందని అయేషా మరో…ఆశ.

Also Read: గుటక గుటకలో గరళం.. గరం గరం ఛాయ్‌లో విష రసాయనాలు.. టీ తాగేవారికి షాకింగ్ న్యూస్

రాయల చెరువు వద్ద ఇంట్రస్టింగ్ సీన్.. కాన్వాయ్‌లో వెళ్తున్న బాబుకు చెవిరెడ్డి నమస్కారం