AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Cop: స్వీట్స్‌కు డబ్బులు అడిగిన షాప్ యజమానిపై ఎస్సై జులుం.. ఓవరాక్షన్‌ వీడియో వైరల్..

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లోని కల్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్‌.ఐ. సర్వేంద్ర కుమార్ కి విక్రయించిన మిఠాయికి రూ 110 లు ఇవ్వమని షాప్ యజమాని అడిగాడు. తనను డబ్బులు అడిగినందుకు ఆ దుకాణం దారుడిని బెదిరించి పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ కెమెరాకు చిక్కాడు. ఓ స్వీట్ షాపు యజమానితో గొడవపడ్డాడు. కొన్న సీట్స్ కు బిల్లు కట్టమని అడిగినందుకు పెద్ద రచ్చచేసి.. అతన్ని బెదిరించాడు. 

UP Cop: స్వీట్స్‌కు డబ్బులు అడిగిన షాప్ యజమానిపై ఎస్సై జులుం.. ఓవరాక్షన్‌ వీడియో వైరల్..
Up Cop Over Action
Surya Kala
|

Updated on: Jun 20, 2023 | 11:47 AM

Share

సమాజంలో ప్రజలకు భద్రత.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించే వారు పోలీసులు. అందుకనే వీరిని రక్షక భటులు అంటారు. తన, పర, పేద, ధనిక భేదం లేకుండా సమాజంలోని పౌరుల సమస్యలపట్ల స్పందించి, వారికి రక్షణ కల్పిచండం వీరి బాధ్యత. ఎంతో బాధ్యతాయుతమైన విధులను నిర్వహిస్తూ కూడా కొందరు రక్షభటులు కాదు.. భక్షక భటులు అనిపిస్తున్నారు. తమకున్న  అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఎస్సై ఓ స్వీటు షాపు యజమానిని స్వీట్స్ కు డబ్బులు అడిగినందుకు బెదిరిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. తన స్వీటు షాపులో కొన్న స్వీట్స్ కు డబ్బులు చెల్లించమని అడిగాడు షాపు యజమాని.. అంతే, కోపంతో ఊగిపోయిన పోలీస్.. యజమానితో గొడవకు దిగాడు. ఈ ఘటన  ఉత్తరప్రదేశ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లోని కల్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్‌.ఐ. సర్వేంద్ర కుమార్ కి విక్రయించిన మిఠాయికి రూ 110 లు ఇవ్వమని షాప్ యజమాని అడిగాడు. తనను డబ్బులు అడిగినందుకు ఆ దుకాణం దారుడిని బెదిరించి పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ కెమెరాకు చిక్కాడు. ఓ స్వీట్ షాపు యజమానితో గొడవపడ్డాడు. కొన్న సీట్స్ కు బిల్లు కట్టమని అడిగినందుకు పెద్ద రచ్చచేసి.. అతన్ని బెదిరించాడు.

ఇవి కూడా చదవండి

అతడిని దుర్భాషలాడుతూ ‘నన్నే డబ్బులు అడుగుతావా. రేపటి నుంచి నువ్వు షాప్ ఎలా నడుపుతావో చూస్తా. నేనేంటో చూపిస్తానంటూ’ వార్నింగ్ ఇచ్చాడు. ఓ స్వీట్ షాప్‌లో జరుగుతున్న ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సబ్-ఇన్‌స్పెక్టర్ మద్యం మత్తులో ఉన్నాడని ..  ఎవరైనా అతన్ని గొడవ పడకుండా వారించామని .. ఈ విషయం అతని ఉన్నతాధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని దుకాణం దగ్గర ఉన్న కొందరు సూచించారు.

ఆ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసి.. పోలీస్ అధికారులను ట్యాగ్ చేశాడు. అంతే.. ఎస్సై చేసిన నిర్వాకం అంతా బయపడింది. సర్వేంద్ర కుమార్ ను  వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) సస్పెండ్    చేసి.. కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎస్సై సర్వేంద్ర కుమార్ పై మండి పడుతున్నారు. అధికారం ఉందని, సామాన్య ప్రజలపై జలుం చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులను పరువు తీశాడని ఆ అధికారి నిందిస్తున్నారు. సీఎం యోగీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..