మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. రైల్వే ట్రాక్‌పై 7 మీటర్ల పొడవైన టెలిఫోన్ స్తంభం..!

లోకో ఫైలట్ అప్రమత్తంతో రెప్పపాటు ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్, ఘాజీపూర్, డియోరియా తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రైలు ప్రమాదానికి పన్నిన కుట్ర భగ్నమైంది.

మరో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. రైల్వే ట్రాక్‌పై 7 మీటర్ల పొడవైన టెలిఫోన్ స్తంభం..!
Doon Express
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 19, 2024 | 9:06 PM

లోకో ఫైలట్ అప్రమత్తంతో రెప్పపాటు ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్, ఘాజీపూర్, డియోరియా తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో రైలు ప్రమాదానికి పన్నిన కుట్ర భగ్నమైంది. ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక నైనీ జన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణిస్తున్న ట్రాక్‌పై పాత 7 మీటర్ల పొడవైన టెలికాం స్తంభాన్ని ఉంచారు దుండగులు.

ఇంతలో డెహ్రాడూన్ (డూన్) ఎక్స్‌ప్రెస్ అక్కడి నుండి వెళుతోంది. రైల్వే ట్రాక్‌పై స్తంభాన్ని చూసిన రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌పై స్తంభం ఉన్నట్టు సమాచారం అందుకున్న జీఆర్‌పీ, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న పిల్లర్‌ను అధికారులు తొలగించారు. ఆ తర్వాత రైలు ముందుకు సాగింది.

ఈ సంఘటన గత బుధవారం(సెప్టెంబర్ 18) రాత్రి జరిగింది. బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక ప్రయాణిస్తున్న బిలాస్‌పూర్ రోడ్ రుద్రాపూర్ సిటీ స్టేషన్‌లోని కిమీ 43/10-11 రైల్వే లైన్ వద్ద రైల్వే ట్రాక్‌పై టెలికాం పాత 7 మీటర్ల పొడవైన ఇనుప స్తంభం ఉంచారు దుండగులు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ (నెం. 12091) లోకో పైలట్ ఆ స్తంభాన్ని గమనించాడు. ఇది చూసి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును వేసి ఆపేశాడు.

ఈ సంఘటనకు సంబంధించి డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్ స్టేషన్ మాస్టర్, GRP కి సమాచారం అందించారు. వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొంతసేపటికి రాంపూర్ ఎస్పీ, జిల్లా పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్తంభాన్ని స్వాధీనం చేసుకుని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొరాదాబాద్‌కు చెందిన జీఆర్పీ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రైళ్ల కార్యకలాపాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో సంఘ విద్రోహక శక్తులు రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని జీఆర్పీ ఎస్పీ పేర్కొన్నారు.

అనంతరం గురువారం ఉదయం అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. చుట్టుపక్కల వారిని విచారించారు. కాలనీ వెనుక రైలు మార్గంలో కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుంటారని స్థానికులు తెలిపారు. ఈ కారణంగా పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న దొంగతనాలు కూడా జరుగుతుంటాయని వెల్లడించారు. ఈ పని వారే చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జీఆర్పీ, ఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు ఈ స్తంభాన్ని ఉంచిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

రాంపూర్ కంటే ముందే యూపీలోని కాన్పూర్, డియోరియా, ఘాజీపూర్‌లలో రైలు ప్రమాదాలు జరిగేందుకు కుట్ర జరిగింది. కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్‌ రైలు పేల్చేందుకు కుట్ర జరిగింది. రైలు పట్టాలపై గ్యాస్‌ సిలిండర్లు పెట్టారు. ఘటనా స్థలంలో సిలిండర్‌తో పాటు గాజు సీసా, అగ్గిపుల్లలు, అనుమానాస్పద బ్యాగ్ లభ్యమయ్యాయి. కాగా ఘాజీపూర్‌లో రైల్వే ట్రాక్‌పై పెద్ద చెక్క దిమ్మెను ఉంచారు. ఫ్రీడమ్ ఫైటర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింది. అయితే రైలు పట్టాలు తప్పకుండా లోకో ఫైలట్ కాపాడారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?