Kishan Reddy: ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

కేంద్ర మంత్రివర్గం ఏకకాల ఎన్నికలకు ఆమోదం తెలపడం అభినందనీయమైన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దీని వల్ల ఖర్చును ఆదా చేయడంతోపాటు దేశాభివృద్ధి మెరుగుపరుస్తుందన్నారు.

Kishan Reddy: 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు'పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Union Minister Kishan Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 19, 2024 | 8:17 PM

కేంద్ర మంత్రివర్గం ఏకకాల ఎన్నికలకు ఆమోదం తెలపడం అభినందనీయమైన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. దీని వల్ల ఖర్చును ఆదా చేయడంతోపాటు దేశాభివృద్ధి మెరుగుపరుస్తుందన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం(సెప్టెంబర్1 8) ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు నివేదికను సమర్పించింది. దీనిపై మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల డబ్బుతోపాటు వనరులను ఆదా చేయడం, అభివృద్ధి, సామాజిక ఐక్యతను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు భారతదేశ ఆకాంక్షలను సాకారం చేయడంలో ప్రజాస్వామ్య పునాదిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఏకకాల ఎన్నికలు మోడల్ ప్రవర్తనా నియమావళి (MCC) విధించడం వల్ల విధాన పక్షవాతం కారణంగా అభివృద్ధి పనులకు అంతరాయం కలిగించడమే కాకుండా, ఎన్నికల సమయంలో మోహరించిన కీలకమైన సిబ్బందిపై ఓటరు అలసత్వం, భారానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఏకకాల ఎన్నికలతో పోల్చితే దాదాపు 1.5 శాతం ఎక్కువ వాస్తవ జాతీయ వృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఏకకాల ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణంలో 1.1 శాతం పెద్ద పతనం ఉంటుందని కిషన్ రెడ్డి అంచనా వేశారు. విడివిడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖజానాపై గణనీయమైన ఆర్థిక భారం పడిందన్న కేంద్ర మంత్రి, గత పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఖర్చులు రూ. 4,500 కోట్లకు మించాయన్నారు.

కేబినెట్ ముందు రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదికను సమర్పించడం న్యాయ మంత్రిత్వ శాఖ 100 రోజుల ఎజెండాలో భాగం. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఆ తర్వాత 100 రోజుల్లోగా ఏకకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. సిఫార్సుల అమలును పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.

ఏకకాల ఎన్నికలతో, దేశంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటిది, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలకు, తరువాత 100 రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. సంప్రదింపులు జరిపిన 47 రాజకీయ పార్టీలలో 32 ఏకకాల ఎన్నికల కాన్సెప్ట్‌పై సానుకూలంగా స్పందించాయి. అన్ని పార్టీలను సంప్రదించిన తర్వాతే రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికను రూపొందించినట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఈ నేపథ్యంలోనే ఏకకాల ఎన్నికలతో అయ్యే ఖర్చు తగ్గుతుంది. గత నవంబర్‌లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు అయిన ఖర్చు రూ. 701 కోట్లు. లోక్‌సభ ఎన్నికలకు అయిన ఖర్చు రూ. 622 కోట్లు. మొత్తం రూ. 1323 కోట్లు ఖర్చు పెట్టింది ఎలక్షన్‌ కమిషన్‌. దేశవ్యాప్తంగా జరిగిన జనరల్‌ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం పెట్టిన ఖర్చు 10వేల కోట్ల రూపాయలు. ఒకవేళ.. వన్‌ నేషన్-వన్ ఎలక్షన్‌ జరిగితే ఈ ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే, మ్యాన్‌ పవర్‌ కూడా కలిసొస్తుంది. రెండు ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే.. ఎన్నికల ఖర్చు, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం అన్నీ తగ్గుతాయనేది ఓ ఆలోచన. పైగా ఓటింగ్‌ శాతం కూడా పెరుగుతుంది. ఓటు వేయడం కోసం రెండుసార్లు, రెండు రోజులు పనులు మానుకుని రానక్కర్లేదు. ఒకసారి బూత్‌లోకి వెళ్తే.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులకు ఓటు వేసి రావొచ్చు..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..