Bihar: వింత దొంగ! కొట్టేసిన సొమ్ములో వాటా ఇవ్వలేదని.. ఏం చేశాడో తెలుసా..?
బీహార్‌లోని మోతీహరిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దొంగలు కలిసి ఒక ప్రదేశం నుండి దొంగిలించారు. ఆపై వస్తువులను పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. కాని ముగ్గురు దొంగలలో ఒకరికి దొంగిలించిన వస్తువులలో కొంత భాగాన్ని ఇవ్వాలనుకున్నారు.
బీహార్‌లోని మోతీహరిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దొంగలు కలిసి ఒక ప్రదేశం నుండి దొంగిలించారు. ఆపై వస్తువులను పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. కాని ముగ్గురు దొంగలలో ఒకరికి దొంగిలించిన వస్తువులలో కొంత భాగాన్ని ఇవ్వాలనుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అతను మిగిలిన ఇద్దరిపై తుపాకీ గురిపెట్టాడు. అంతేకాదు దొంగతనం జరిగిన మొత్తం తీరును పోలీసులకు చెప్పేశాడు. తన తోటి స్నేహితుల ఆచూకీని కూడా చెప్పాడు. దీంతో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నారు.
మోతీహరి ప్రాంతంలో ముగ్గురు దొంగల ముఠా ఓ ఆరోగ్య కార్యకర్త ఇంట్లో దొంగతనం చేశారు. ముగ్గురూ తాళం పగులగొట్టి డబ్బు, నగలతో పరారయ్యారు. దీంతో ముగ్గురూ దొంగిలించిన సరుకులో మూడు వాటాలు చేసుకోవాలని, ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. సొమ్ము పంచుకునే సమయం వచ్చినప్పుడు, ఇద్దరు దొంగలు దొంగిలించిన వస్తువులలో తక్కువ వాటా మూడవ దొంగకు ఇవ్వాలనుకున్నారు. ఇది కాస్తా మూడవ దొంగకు కోపం తెప్పించింది. దీంతో తన వద్ద ఉన్న తుపాకీని చూపిస్తూ, ఇద్దరు సహచరులను బెదిరించాడు. దీన్నంతటిని స్థానికులు వీడియో తీశారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు దొంగలు తమ ప్రాణాలను కాపాడుకుని అక్కడి నుంచి పారిపోయారు. కానీ తుపాకీతో బెదిరించిన వ్యక్తి జనానికి చిక్కాడు. దీంతో దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు.
పట్టుబడిన దొంగ పేరు మహమ్మద్ ఆరిఫ్ అన్సారీ అని చకియా డీఎస్పీ తెలిపారు. అతను ఒక ఆరోగ్య కార్యకర్త ఇంట్లో జరిగిన దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. తనతోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడు. ఆ తర్వాత జరిగిన మొత్తం కథను వివరించాడు. కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు చోరీకి గురైన మొత్తంలో రూ.12,100 నగదును స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆరిఫ్ తన మరో ఇద్దరు స్నేహితుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే వారిద్దరినీ పట్టుకుంటామన్నారు చకియా డీఎస్పీ.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..