AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Borewell Rescue Boy Safe: ఎట్టకేలకు ఫలించిన అధికారుల ప్రయత్నాలు.. బోరుబావిలో నుంచి క్షేమంగా బయటపడ్డ నాలుగేళ్ల బాలుడు

ఉత్తరప్రదేశ్‌లో బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆగ్రాలోని ఫతేబాద్ ధరియాయి గ్రామానికి చెందిన శివ.. ఆడుకుంటూ వెళ్లి 180 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయాడు.

UP Borewell Rescue Boy Safe: ఎట్టకేలకు ఫలించిన అధికారుల ప్రయత్నాలు.. బోరుబావిలో నుంచి క్షేమంగా బయటపడ్డ నాలుగేళ్ల బాలుడు
Up Borewell Rescue Boy Safe
Balaraju Goud
|

Updated on: Jun 14, 2021 | 6:49 PM

Share

UP Borewell Rescue Boy Safe: ఉత్తరప్రదేశ్‌లో బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆగ్రాలోని ఫతేబాద్ ధరియాయి గ్రామానికి చెందిన శివ అనే బాలుడు.. ఆడుకుంటూ వెళ్లి 180 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు..తాళ్లతో బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. తరువాత సహాయక బృందాలు అక్కడికి చేరుకుంది. ఆర్మీ సాయంతో ఆ బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీశారు. తరువాత వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయాడు. ఫతేబాద్ ధరియాయి గ్రామానికి చెందిన బాలుడు..ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ 180 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటినుంచి సహాయకార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికంగా నివసించే శివ కుమారుడు నాలుగేళ్ల చోటేలాల్‌..ఆడుకుంటూ వెళ్లి ఆ బావిలో పడిపోయాడు.

బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కేకలు వేయడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు..తాళ్లను బావిలోకి పంపి బాలుణ్ణి కాపాడేందుకు ప్రయత్నించారు. ఐతే వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. బాలుడిని బయటకు తీసేందుకు సహాయ చర్యలు చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ అందిస్తూ సమాంతరంగా గొయ్యి తవ్వారు. బాలుడి పరిస్థితిని తెలుసుకునేందుకు మైక్రో కెమెరాలను పంపించారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకొని సహాయకచర్యలను పర్యవేక్షించారు.

లేటెస్ట్‌ టెక్నాలజీ సాయంతో చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, తన అల్లరితో తమ ఇంట్లో సందడి చేసే చిన్నారి.. బోరుబావిలో పడిపోవడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడిని సురక్షితంగా బయటకు తీయాలని వేడుకున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఘటనాస్థలానికి చేరుకుని శాయశక్తుల ప్రయత్నించి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో తల్లిదండ్రులతో గ్రామస్తులంతా ఉపిరి పీల్చుకున్నారు.

ఇప్పటివరకు నోళ్లు తెరిచిన బోరుబావులు ఎంతోమంది చిన్నారులను మింగేశాయి. ఐనా మార్పు రావడం లేదు. ఘటన జరిగినప్పుడు పెద్ద ఎత్తున స్పందన వచ్చినా..ఆ తర్వాత వాటి సంగతే వదిలేస్తున్నారు. ఫలితంగా అమాయకపు పసిబిడ్డలు ఇలా బోరుబావుల్లో పడిపోతున్నారు. వారిని తీసేందుకు లేటెస్ట్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా మరుగున పడిపోతున్నాయి. మరోవైపు తెరిచి ఉన్న బోరుబావులతో ప్రమాదమని అప్రమత్తంగా ఉండాలని..ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రజలు వినిపించుకోవడం లేదని అంటున్నారు అధికారులు. బోరుబావులపై ఎంత అవగాహన కల్పించినా పట్టించుకోవడంలేదంటున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Read Also… Galwan Attacks: గల్వాన్ లోయలో ఘర్షణలకు ఏడాది..అప్పుడు ఏం జరిగింది..ఇప్పుడు భారత చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది?