ప్రియాంకపై జులుం, క్షమాపణలు చెప్పిన యూపీ పోలీసులు

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై ఈ నెల 3 న నోయిడా ఫ్లై ఓవర్ వద్ద జరిగిన పోలీస్ జులుం ను యూపీ పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ రోజున లాఠీచార్జీ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు యత్నిస్తున్న...

ప్రియాంకపై జులుం, క్షమాపణలు  చెప్పిన యూపీ పోలీసులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 05, 2020 | 10:34 AM

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై ఈ నెల 3 న నోయిడా ఫ్లై ఓవర్ వద్ద జరిగిన పోలీస్ జులుం ను యూపీ పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ రోజున లాఠీచార్జీ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు యత్నిస్తున్న సమయంలో వారిని రక్షించడానికి ప్రియాంక పరుగున దూసుకు వెళ్లారు.  హెల్మెట్ ధరించిన ఓ పోలీసు ఆమె కుర్తా పట్టుకుని లాగివేయడానికి ప్రయత్నించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. నాడు జరిగిన తోపులాటలో ప్రియాంక ఓ దశలో కిందపడబోయారు. ఈ ఘటనపట్ల నోయిడా పోలీసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ,, ఆమెకు క్షమాపణలు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ప్రియాంక పట్ల సంబంధిత పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని భావించిన ఉన్నతాధికారులు.. ఈ సంఘటనపై ఓ మహిళా పోలీసు అధికారిచేత దర్యాప్తు జరిపిస్తామన్నారు. మహిళల భద్రత, వారి గౌరవానికే తాము కట్టుబడి ఉన్నామన్నారు.

హత్రాస్ ఘటనపై నిరసన వ్యక్తం చేయడానికి ప్రియాంక, రాహుల్ గాంధీ తమ కార్యకర్తలతో  ఆ జిల్లాకు వెళ్తుండగా నోయిడా ఫ్లై ఓవర్ వద్ద గత శనివారం ఈ ఇన్సిడెంట్ జరిగింది. రాహుల్, ప్రియాంక గాంధీలను అనుమతించిన పోలీసులు పార్టీ కార్యకర్తలను మాత్రం అడ్డుకున్నారు.