హాథ్రస్‌లో అసలు అత్యాచారమే జరగలేదంటున్న బీజేపీఎమ్మెల్యే రాజ్‌వీర్‌సింగ్ పహిల్వాన్
నిందితులకు మద్దతుగా సభలు సమావేశాలు పెట్టడం వింతే కదా! ఆ వింత ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో జరిగింది.. ఓ దళిత అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై ఆమెను నానా రకాలుగా హింసించి ప్రాణాలు పోయేలా చేసిన నలుగురు...
నిందితులకు మద్దతుగా సభలు సమావేశాలు పెట్టడం వింతే కదా! ఆ వింత ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో జరిగింది.. ఓ దళిత అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై ఆమెను నానా రకాలుగా హింసించి ప్రాణాలు పోయేలా చేసిన నలుగురు నిందితులకు మద్దతుగా హాథ్రస్‌లో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజ్‌వీర్ సింగ్ పహిల్వాన్ ఇంట్లో ఓ సమావేశం జరిగింది.. రాజ్‌వీర్ సింగ్ అయితే అసలు అత్యాచారమే జరగలేదంటున్నారు.. ఆరోపణలన్నీ అవాస్తవాలంటున్నారు. ఇది విపక్షాల కుట్ర అని చెబుతున్నారు.. నిందితులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని రాజ్‌వీర్ సింగ్ కుమారుడు మన్వీర్‌సింగ్ చెప్పడం గమనార్హం. అగ్రకులాలవారే కాదట.. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారట.. బాధిత కుటుంబసభ్యులపైనా కేసు నమోదు చేయాలని ఆ సమావేశంలో డిమాండ్ చేశారట.. ఇలాగని మన్వీర్ సింగ్ తెలిపారు. ఎందుకు కేసు పెట్టాలంటే.. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబం పలుమార్లు తమ స్టేట్‌మెంట్‌ను మార్చినందుకట! ఇక హాథ్రస్ ఘటనపై యూపీ సర్కార్ సీబీఐ దర్యాప్తును కోరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మన్వీర్‌సింగ్. ఇది ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కొందరు పన్నిన కుట్రే అని విమర్శించారు.. ఇలాంటి విచారణకైనా నిందితులు రెడీగా ఉన్నారని, బాధిత కుటుంబాలు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ కూతుళ్లకు మంచి మర్యాద నేర్పించాలని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్లియా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సురేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ కూతుళ్ళు మర్యాదగా నడుచుకునేలా పెంచడం తల్లిదండ్రుల ధర్మమని సురేంద్రసింగ్ అన్నారు.