మిత్రుడిని లారీతో తొక్కి చంపేశాడు..రీజన్ ఏంటంటే ?
భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో మిత్రుడినే కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో మిత్రుడినే కడతేర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ముల్పూరి రాంగోపాల్(28) అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ తోట నాగేంద్రబాబు మిత్రులు. ఆగస్టు 28న రాంగోపాల్ హైదరాబాదు వెళ్తానని ఇంటివద్ద చెప్పి వచ్చేశాడు. సెప్టెంబరు 5 నుంచి అతడి ఫోన్ కలవకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ ట్రాకింగ్‌లో బొబ్బిలిలో ఉన్నట్లు సంకేతాలు రావడంతో బొబ్బిలి పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాదు వెళ్తానని చెప్పిన రాంగోపాల్ అదే రోజు మిత్రుడు నాగేంద్రబాబుతో లారీలో గుజరాత్ వెళ్లారు. అక్కడ నుంచి గతనెల 5న మార్బుల్స్ లోడుతో బొబ్బిలి వచ్చారు. సరకు దించి రిటన్ ప్రయాణంలో పారిశ్రామికవాడ వద్ద లారీని ఆపారు. రాంగోపాల్‌తో నాగేంద్రబాబు మద్యం తాగించాడు. నాగేంద్రబాబుకు మద్యం అలవాటున్నా సేవించకుండా జాగ్రత్త పడ్డాడు. క్లీనర్ సాయితేజను క్యాబిన్‌లో పడుకోమని చెప్పి తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాంగోపాల్‌ను చంపేయాలని డిసైడయ్యాడు. ( గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )
చనిపోయిన వ్యక్తి
రాంగోపాల్ స్పృహ కోల్పోయాక రోడ్డుపై పడేసి లారీతో తొక్కించి పోనిచ్చాడు. క్లీనర్ శివ ఆసమయంలో నిద్రిస్తున్నాడు. కాసేపటికే శివ నిద్రమత్తు నుంచి తేరుకుని రాంగోపాల్ గురించి ప్రశ్నిచంగా… విశాఖలోని సోదరుడు ఇంటికి వేరే వాహనంలో వెళ్తానని చెప్పి దిగిపోయాడని ఒకసారి, బొబ్బిలిలో టిప్పర్ ఢీకొందని మరోసారి చెప్పి ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే చంపేస్తానని నాగేంద్రబాబు బెదిరించాడు. నాగ్రేందబాబుతో సన్నిహితంగా ఉంటాడని పోలీసులకు కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ దిశగా కేసును విచారించి నిందితుడిని పట్టుకున్నారు. ( వాట్సాప్‌లో కొత్తగా అదిరిపోయే ఫీచర్స్ )