ఏపీ: ఆ ఒక్క జిల్లాలో లక్ష దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,811 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీ: ఆ ఒక్క జిల్లాలో లక్ష దాటిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే!
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2020 | 8:19 PM

Coronavirus Positive Cases: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,811 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,242 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,19,256కి చేరింది. ఇందులో 54,400 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,58,875 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 40 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,981కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 60.94 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 411, చిత్తూరు 863, తూర్పుగోదావరి 826, గుంటూరు 562, కడప 408, కృష్ణా 469, కర్నూలు 220, నెల్లూరు 413, ప్రకాశం 582, శ్రీకాకుళం 192, విశాఖపట్నం 222, విజయనగరం 221, పశ్చిమ గోదావరి 853 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 675 మంది కరోనాతో మరణించారు.