హత్రాస్ కుటుంబానికి వై ప్లస్ భద్రత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్

హత్రాస్ కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. వారికి ప్రాణ హాని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హత్రాస్ కుటుంబాన్ని..

హత్రాస్ కుటుంబానికి వై ప్లస్ భద్రత, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 04, 2020 | 8:14 PM

హత్రాస్ కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించాలని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. వారికి ప్రాణ హాని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, ఈ కేసుపై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత దర్యాప్తు లేదా విచారణ జరిపించాలని కోరారు. ఈ కుటుంబానికి ఇక్కడ సెక్యూరిటీ లేదు. అవసరమైతే వీరిని నా ఇంటికి తీసుకువెళ్లి వారికి భద్రత కల్పిస్తాను అని చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. హత్రాస్ కేసుపై సీబీఐ దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిఫారసు చేసినప్పటికీ, ఆజాద్ మాత్రం దీన్ని తేలికగా కొట్టి పారేసినట్టు కనిపిస్తోంది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఆయన సూచించారు.