మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య?
కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు
Krishna district mystery deaths: కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను అక్కడి స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.
మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చిన్నస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరు హత్య చేసి ఉంటారా..? వీరి హత్యకు గల కారణాలేంటి..? వంటి ప్రశ్నలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Read More: