ఆన్‌లైన్ క్లాస్‌లు.. పెరుగుతున్న సైబర్ క్రైమ్ కేసులు
కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్ క్లాస్‌ల వలన సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ అన్నారు
Online classes Cyber crimes: కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న ఆన్‌లైన్ క్లాస్‌ల వలన సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని సైబరాబాద్ షీటీమ్స్ డీసీపీ అనసూయ అన్నారు. విద్యార్థినుల పట్ల గురువులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని.. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో సైబర్ క్రైమ్, షీటీమ్స్ గత నెలలో 161 కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. అందులో 41 కేసులు తీవ్రమైన నేరాలని అనసూయ వెల్లడించారు.
ఆన్‌లైన్ క్లాస్‌లు జరిగేటప్పుడు డౌట్లు వస్తే పర్సనల్‌గా క్లియర్ చేస్తామంటున్న కొందరు ఉపాధ్యాయులు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో దీపక్ మిశ్రా అనే లెక్చరర్ ఓ 17 ఏళ్ళ బాలికపై ఇదే మాదిరిగా ప్రవర్తించారని అనసూయ అన్నారు. డౌట్స్ క్లారిఫై కోసం దీపక్‌కి కాల్ చేస్తే ఇంటికి వచ్చి చెబుతానని చెప్పిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేరని అనసూయ వివరించారు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు షీటీమ్‌ని ఆశ్రయించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం లెక్చరర్ దీపక్ మిశ్రా పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అనసూయ తెలిపారు.
Read More:
Bigg Boss 4: అభిజిత్-అఖిల్ మధ్య బిగ్ ఫైట్.. ఏడ్చేసిన మోనాల్