Covid Vaccine.. Aadhar Number, OTP: వ్యాక్సిన్ కోసం మీ ఆధార్ నెంబ‌ర్‌, ఓటీపీ అడుగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌

Covid Vaccine.. Aadhar Number, OTP: ఏ రంగంలోనైనా మంచి జ‌ర‌గ‌డానికంటే మోసాలు జ‌రిగేందుకు ముందుగా ఆస్కారం ఉంటుంది. టైం దొరికిపోతే చాలు మోస‌గాళ్లు ఇట్టే...

Covid Vaccine.. Aadhar Number, OTP: వ్యాక్సిన్ కోసం మీ ఆధార్ నెంబ‌ర్‌, ఓటీపీ అడుగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌
Follow us

|

Updated on: Jan 02, 2021 | 5:50 PM

Covid Vaccine.. Aadhar Number, OTP: ఏ రంగంలోనైనా మంచి జ‌ర‌గ‌డానికంటే మోసాలు జ‌రిగేందుకు ముందుగా ఆస్కారం ఉంటుంది. టైం దొరికిపోతే చాలు మోస‌గాళ్లు ఇట్టే దూరిపోతుంటారు. ప్ర‌స్తుతం ఆధార్ నెంబ‌ర్లు, ఓటీపీల‌తో ఎన్నో మోసాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆరోగ్య‌శాఖ ఆధార్ నెంబ‌ర్లు, ఓటీపీలు, బ్యాంక్ వివ‌రాలు ఎవ్వ‌రికి ఇవ్వ‌వ‌ద్ద‌ని ముంద‌స్తుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ హెచ్చ‌రిక‌లు ఎందుకు చేసిందంటే… దేశంలో అందుబాటులోకి వ‌స్తున్న క‌రోనా వ్యాక్సిన్ కార‌ణంగా ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఆధార్ నెంబ‌ర్ ప్ర‌కార‌మే ఇస్తుండ‌టంతో ముందుగా ఫోన్లు చేసి ఆధార్ నెంబ‌ర్ చెప్పాల‌ని, దీంతో మీ నెంబ‌ర్‌కు ఓ ఓటీపీ వ‌స్తుంది దానిని చెప్పాల‌ని అడుగుతుంటారు. అలా అన్ని వివ‌రాలు చెప్పేస్తే మీకు రావాల్సిన వ్యాక్సిన్ వంతు వాళ్లే తీసేసుకుంటారని అధికారులు చెబుతున్నారు.

వ్యాక్సినేష‌న్ సంద‌ర్భంగా గోర‌ఖ్‌పూర్ డిస్ట్రిక్ట్ హెల్త్ అఫీషియ‌ల్ మాట్లాడుతూ.. ఉత్త‌ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ఇంకా సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ పంపిణీ ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని, తొలి ద‌శ‌లో ఫ్రంట్‌లైన్ యాంటీ కోవిడ్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే పంపిణీ చేయ‌నుంద‌ని తెలిపారు. అలాగే గోర‌ఖ్‌పూర్ సీఎంఓ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ తివారీ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులంటూ కొంద‌రు ఆధార్ నెంబ‌ర్లు, ఓటీపీ చెప్పాలని అడుగుతుంటారు… యాంటీ కోవ‌డ్ వ్యాక్సిన్ గురించి రిజిష్ట‌ర్ చేసుకునేందుకు ఖ‌చ్చితంగా ఇవ్వాల‌ని చెబుతుంటారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ప్రిక్రియ‌లో భాగంగా ఎటువంటి వివ‌రాలు ఇవ్వాల్సిన అవ‌రం లేద‌ని ఆయన స్పష్టం చేశారు.

కాగా, నేష‌న్ డ్ర‌గ్స్ రెగ్యులేట‌ర్ శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ ఆస్ట్రాజెనికా, భార‌త్ బ‌యోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల‌కు అప్రూవ‌ల్ ఇచ్చే విష‌యంపై చర్చించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ్యాక్సిన్ పంపిణీ కోసం విలువైన వివ‌రాల‌ను సేక‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 2న దేశ వ్యాప్తంగా డ్రైర‌న్ నిర్వ‌హిస్తున్నారు

Also Read:

Britain Coronavirus: బ్రిటన్‌లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో భారీగా నమోదైన పాజిటివ్‌ కేసులు

Covid-19 Vaccinations Countries: ఏఏ దేశాల్లో వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది..? ఎంత మందికి టీకా అందించారు..?

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..