AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stalin VS Alagiri: రసవత్తరంగా అన్నదమ్ముల రాజకీయం.. సొంత పార్టీ పెట్టే ఆలోచనలో అళగిరి..?

Stalin VS Alagiri: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే కమల్‌ హాసన్ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక రజినీకాంత్‌ పార్టీని ప్రారంభిస్తాడనే సమయానికి

Stalin VS Alagiri: రసవత్తరంగా అన్నదమ్ముల రాజకీయం.. సొంత పార్టీ పెట్టే ఆలోచనలో అళగిరి..?
Narender Vaitla
|

Updated on: Jan 02, 2021 | 4:32 PM

Share

Stalin VS Alagiri: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే కమల్‌ హాసన్ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక రజినీకాంత్‌ పార్టీని ప్రారంభిస్తాడనే సమయానికి అనారోగ్యం పాలవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ అతని సోదరుడు అళగిరి మధ్య జరుగుతోన్న రాజకీయం ప్రస్తుతం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. సోదరుడితో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చిన అళగిరి ప్రస్తుతం సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా దక్షిణ తమిళనాడులోని అతని వర్గానికి చెందిన నాయకులతో పాటు డీఎంకే పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో కొత్త పార్టీ పెట్టాలా.? లేదా మరే పార్టీకైనా మద్ధతు ప్రకటించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అళగిరి ఏర్పాటు చేస్తోన్న ఈ సమావేశంతో డీఎంకే పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన మొదలైంది. పార్టీ నుంచి ఎవరు వీడతారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే అళగిరి బీజేపీలో చేరనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి అళగిరి కొత్త పార్టీ పెడతారా.? లేదా ఏదైనా పార్టీలో చేరతారా వేచి చూడాలి. మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ దూకుడు పెంచాయి. బీజేపీ కూడా ఈసారి తమిళనాడులో జెండా ఎగరవేయాలని భావిస్తోంది.

Also Read: నాడు ఇందిరా గాంధీ చేసిన రాజ్యాంగ సవరణకు బీజేపీ మోకాలడ్డు ? యూపీలో రేపు కాంగ్రెస్ సంవిధాన్ చర్చా దివస్ గా పాటింపు