Mining: మరింత పారదర్శకంగా మైనింగ్ లీజుల కేటాయింపు..మైనింగ్ చట్టాలను సరళీకృతం చేసిన కేంద్రం
భారత ప్రభుత్వం మైనింగ్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. మైనింగ్ లీజుల కేటాయింపులో పారదర్శక విధానాలను అవలంబించాలని నిర్ణయం తీసుకుంది.

Mining: భారత ప్రభుత్వం మైనింగ్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. మైనింగ్ లీజుల కేటాయింపులో పారదర్శక విధానాలను అవలంబించాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం పాత చట్టాలను సవరించింది. ఎంఎడీఆర్(MMDR) సవరణ చట్టం ద్వారా 2015 ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ అలాగే మైనింగ్ లీజు చట్టాన్ని సవరించింది. ఈ చట్టం 2021లో మరింత సరళీకృతంగా మార్చారు. ఇటీవల చేసిన సవరణల ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబదులు అదేవిధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రాల ఆదాయం కూడా ఈ సరళీకరణ వలన పెరుగుతుంది. ఈ చట్టాన్ని సరళీకృతం చేయడం ద్వారా రాష్ట్రాలు లీజు దారులను మార్చడం జరిగిన తరువాత మైనింగ్ కార్యకలాపాల్లో వేగం మందగించకుండా చూడగలుగుతాయి. అదేవిధంగా, ఖనిజ వనరుల అన్వేషణలో వేగం పెరుగుతుంది. కేంద్రం ఈ సవరణల ద్వారా మైనింగ్ వేలం వేగం పెంచాలని రాష్ట్రాలను కోరుతోంది.
ఈ సవరణతో, ‘ఆత్మ-నిర్భర్ భారత్’ విధానాన్ని మరింత పెంచేందుకు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళికంగా 100 మైనింగ్ బ్లాక్‌లను వేలానికి పెట్టింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం ద్వారా దేశంలో ఖనిజాలు నిరంతరం సరఫరా అయ్యేందుకు వీలుంటుంది. మరిన్ని మైనింగ్ బ్లాక్ లను వేలంలోకి తీసుకురావడం వలన రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. ఈ మైనింగ్ బ్లాక్ ల నివేదికను ఈరోజు అంటే సెప్టెంబర్ 8, 2021 తేదీన రాష్ట్రాలకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో మైన్స్, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. మైన్స్, బొగ్గు, రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్ దాన్వేతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
కాలక్రమేణా, ప్రపంచవ్యాప్తంగా ఖనిజ నిక్షేపాల ప్రధాన ఆవిష్కరణలు చాలా తగ్గిపోయాయి. విపరీతమైన సాంకేతిక పురోగతి ఉన్నప్పటికీ లాభదాయకమైన ఖనిజ నిక్షేపాల ఉనికి కనుక్కోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం-ప్రయివేట్ రంగాల నుంచి సరికొత్త ఆలోచనలు.. మరింత మెరుగైన సహకారం కావాల్సి ఉంది. ఇది ఉత్సాహ పూరితమైన భాగస్వామ్యానికి హామీ ఇస్తుంది. ప్రస్తుతం జీఎస్ఐ ద్వారా మైనింగ్ కు అవకాశం ఉన్న 100 రిపోర్టులను రాష్ట్రాలకు అందచేయడం మైనింగ్ రంగ పురోగతికి సహకరిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పనకు మైనింగ్ రంగం కీలకమైన ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..