AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Travel: ఈ 18 దేశాలకు ఇండియన్స్‌ వెళ్లొచ్చు..! విమాన సర్వీసులు ప్రారంభం..

World Travel: ఇటీవల భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం పొడిగించింది. అయితే, 18 దేశాలలో

World Travel: ఈ 18 దేశాలకు ఇండియన్స్‌ వెళ్లొచ్చు..! విమాన సర్వీసులు ప్రారంభం..
International Flight
uppula Raju
|

Updated on: Sep 08, 2021 | 11:13 AM

Share

World Travel: ఇటీవల భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం పొడిగించింది. అయితే, 18 దేశాలలో ‘ఎయిర్ బబుల్’ ఏర్పాటు ద్వారా 49 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించారు. ఎయిర్ బబుల్ సౌకర్యం వల్ల కొన్ని ఆంక్షలతో విమానాలను నడుపుతున్నారు. పౌర విమానాయాన మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ విమానాలను ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, ఎయిర్ ఇండియా కార్యాలయం ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొవిడ్ -19 పరిస్థితి దృష్ట్యా ఒక్కోసారి విమాన షెడ్యూల్ మార్చవచ్చు.

సెప్టెంబర్ 3 న, భారతదేశం బంగ్లాదేశ్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందంతో విమానాలను ప్రారంభించింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇతర దేశీయ విమానయాన సంస్థలు ఢాకాకు విమానాలు నడుపుతున్నాయి.’ఎయిర్ బబుల్’ ఒప్పందం కింద భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, నేపాల్, ఒమన్, ఖతార్, రష్యా, శ్రీలంక., యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), UK, USA దేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది.

కొన్ని దేశాలు ప్రయాణ ఆంక్షలను సడలించాయి మరికొన్ని దేశాలు కూడా భారతదేశానికి ప్రయాణ ఆంక్షలను సడలించాయి. శనివారం ఫిలిప్పీన్స్ దేశం భారతదేశంపై ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న భారతీయులకు టర్కీలో 14 రోజుల క్వారంటైన్‌ లేదు. అయితే టర్కీకి చేరుకున్న తర్వాత భారతీయ ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష రిపోర్ట్‌ని చూపించాలి. ఇది 72 గంటల కంటే పాతది ఉండకూడదు. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై భారత ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను విధించింది.

దీని ప్రకారం UK, యూరోపియన్ యూనియన్, పశ్చిమ ఆసియా దేశాల నుంచి వచ్చే వ్యక్తులు RT-PCR పరీక్ష రిపోర్ట్‌ చూపించడం తప్పనిసరి. అదే సమయంలో భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా వారు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. దేశంలో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు మార్చి 23, 2020 నుంచి నిలిపివేశారు. అయితే మే 2020 నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మాత్రం నడుస్తున్నాయి.

Akshay Kumar: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం.. అక్షయ్ కుమార్ తల్లి మృతి.. భావోద్వేగ పోస్ట్ చేసిన నటుడు..

Vehicle Sales: వాహనాల విక్రయాల పరుగులు.. ఆగస్టులో భారీగా పెరిగిన అమ్మకాలు.. గతేడాదికంటే ఎక్కువగా..

Brinjal Benefits: వంకాయలను తింటే గుండె సమస్యలు ఫసక్.. ప్రయోజనాలు తెలిస్తే ఇట్టే తినేస్తారు..

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..