శునకాలపై మహిళల దాష్టీకం.. పిల్లలతో సహా తల్లి కుక్కను దహనం చేసేశారు.. ఆ తర్వత ఏమైందంటే..?
Women set stray dog puppies on fire: సమాజంలో రోజురోజుకూ దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సాటివారిపైనే కాకుండా జంతువులపై కూడా క్రూరత్వంగా
Women set stray dog puppies on fire: సమాజంలో రోజురోజుకూ దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది సాటివారిపైనే కాకుండా జంతువులపై కూడా క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కేరళలో ఇద్దరు మహిళలు.. కుక్క దాని పిల్లలకు నిప్పటించారు. ఈ అమానవీయ సంఘటన సెప్టెంబర్ 4 (శనివారం)న కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలంగడ్ పోలీస్ పరిధిలోని మంజలి అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. అనంతరం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్‌చేశారు.
మాంజలిలోని ఒక ప్రైవేట్ ప్లాట్‌లో ఇద్దరు మహిళలు కలిసి.. కుక్క దానికి సంబంధించిన ఏడు కుక్కపిల్లలను తగలబెట్టారు. ఈ ఘటనలో కుక్క, దాని ఐదు పిల్లలు స్వల్పంగా కాలిన గాయాలతో బయటపడ్డాయి. మిగిలిన రెండు కుక్కపిల్లలు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. అనంతరం మంటల నుంచి బయటపడిన చిన్న కుక్కపిల్లలన్నీ మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. గమనించిన ఓ మహిళ గాయపడిన కుక్క గురించి దయా అనే జంతు సంరక్షణ సమూహానికి సమాచారం అందించింది. అనంతరం ఆ సంస్థ సభ్యులు తల్లి కుక్కను పశువైద్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే.. ఈ దారుణ సంఘటన అనంతరం.. దీనికి బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై కేరళలోని అలంగడ్ పోలీసులు ఇద్దరు మహిళలు మేరీ, లక్ష్మిపై నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే.. కుక్కు ప్లాట్ లోపల పిల్లలకు జన్మనిచ్చింది. దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా.. అది వారిపై తిరగబడింది. దీంతో వారు కుక్క, నెల వయసున్న ఏడు పిల్లలకు నిప్పటించారని స్థానికులు తెలిపారు.
Also Read: