Nisith Pramanik: కేంద్రమంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఖండించిన టీఎంసీ.. బెంగాల్‌లో ఉద్రిక్తత

మరో వైపు కేంద్ర మంత్రి కారుపై దాడి చేయడాన్ని బెంగాల్‌ బీజేపీ తప్పుబట్టింది. కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Nisith Pramanik: కేంద్రమంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఖండించిన టీఎంసీ.. బెంగాల్‌లో ఉద్రిక్తత
Nisith Pramanik
Follow us

|

Updated on: Feb 25, 2023 | 7:16 PM

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిశీత్‌ ప్రామాణిక్‌కు సొంత రాష్ట్రం బెంగాల్‌లో చేదు అనుభవం ఎదురైంది. పార్టీ శ్రేణులను కలిసేందుకు కూచ్‌బిహీర్ వచ్చిన మంత్రికి నల్ల జెండాలు ఊపుతూ తృణమూల్‌ కార్యకర్తలు నిరసన తెలిపారు. మంత్రి కారుపై రాళ్లు విసరడంతో కారు ముందు అద్దం పగిలిపోయింది. అదే సమయంలో కర్రలు పట్టుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంత్రి కారు దిగి పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మరో వైపు కేంద్ర మంత్రి కారుపై దాడి చేయడాన్ని బెంగాల్‌ బీజేపీ తప్పుబట్టింది. కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బెంగాల్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మంత్రి ప్రామాణిక్‌ కూచ్‌బెహార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. శనివారం స్థానిక బీజేపీ ఆఫీస్‌కు వెళ్లే సమయంలో.. ఆయన కాన్వాయ్‌పై ఈ రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

గత వారం కూచ్‌బెహార్ జిల్లాలోని భేటగురిలో కేంద్రమంత్రి నిషిత్ ప్రామాణిక్‌ నివాసం దగ్గర టీఎంసీ ఒక రోజు ధర్నా నిర్వహించింది. పశువుల స్మగ్లర్‌గా ముద్రవేసి బీఎస్‌ఎఫ్ కాల్చి చంపిన అమాయక రాజ్‌బన్షీ యువకుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నివాసం చుట్టూ 150 మీటర్ల పరిధిలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 విధించామని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..