West Bengal: చోరీ కేసులో కేంద్ర మంత్రి.. అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు.. సంచలనంగా మారిన ఘటన

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చిక్కుల్లో పడిపోయారు. పదమూడేళ్ల క్రితం కేంద్ర మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ కు చోరీ కేసులో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని అలీపూర్‌ దువార్‌ రైల్వే..

West Bengal: చోరీ కేసులో కేంద్ర మంత్రి.. అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు.. సంచలనంగా మారిన ఘటన
Central Minister Nishit Pramanic
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 17, 2022 | 1:01 PM

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి చిక్కుల్లో పడిపోయారు. పదమూడేళ్ల క్రితం కేంద్ర మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ కు చోరీ కేసులో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని అలీపూర్‌ దువార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్ నఓ బంగారం దుకాణంతో పాటు బీర్‌పాడాలోని మరో రెండు బంగారం దుకాణాల్లో 2009 లో దొంగతనం జరిగింది. ఆ కేసులో కేంద్ర మంత్రితో పాటు మరో వ్యక్తిని నిందితులుగా ప్రతివాదులు చేర్చారు. దీనిపై విచారణ జరిపిన అలీపూర్‌ దువార్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేటు కోర్టు అరెస్టు వారంటు జారీ చేసింది. ప్రామాణిక్‌ తరఫు న్యాయవాది దులాల్‌ ఘోష్‌ తమ తదుపరి చర్య ఏమిటో వెల్లడించేందుకు నిరాకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి ఈ కేసును అలీపూర్‌దువార్‌ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 2009 కేసులో నిషిత్ ప్రమాణిక్ నిందితుల్లో ఒకరు. నవంబర్ 11న అలీపుర్‌ దువార్ కోర్టులో చివరి విచారణ జరిగింది. ఇతర నిందితుల న్యాయవాదులు హాజరుకాగా, కేంద్ర మంత్రి నిషిత్ ప్రమాణిక్ తరపు న్యాయవాది రాలేదు. దీంతో అదే రోజు ప్రమాణిక్‌ కు న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

13 ఏళ్ల క్రితం అలీపుర్‌దూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న బంగారం దుకాణాల్లో చోరీలు జరిగాయి. దొంగతనానికి సంబంధించి నిందితుల్లో ఉన్నవారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కేసును నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపుర్‌దువార్ కోర్టుకు బదిలీ చేసారు. కాగా.. 2019లో నిషిత్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో బీజేపీలో చేరారు.

అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అత్యంత పిన్న వయస్కుడైన మంత్రులలో నిషిత్ ఒకరు. దీనికి ముందు ప్రమాణిక్ తృణమూల్ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయి వ్యవహరాలను చూశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఆయనపై అప్పట్లో వేటు వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..