Amit Shah: మూడురోజుల పాటు జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటన.. పహారీలకు ST హోదా కల్పించడంపై కీలక ప్రకటనకు ఛాన్స్
రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారాయన. పహారీలకు ఎస్‌టీ హోదా కల్పించడంపై..
అమిత్‌షా మూడురోజుల జమ్మూకశ్మీర్ పర్యటన రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటారాయన. పహారీలకు ఎస్‌టీ హోదా కల్పించడంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో ముసలానికి కారణమైంది. ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. రాజౌరీ, పూంచ్, బారాముల్లా, హంద్వారా జిల్లాల్లో పహారీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పహారీ భాష మాట్లాడేవారిని పహారీలుగా పిలుస్తారు. వీరు ఎప్పటి నుంచో తమను ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నారు. షెడ్యూల్ తెగకు చెందిన వారిగా వీరిని గుర్తిస్తే భాషా ప్రతిపాదికన ఒక సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుంది. అక్కడ ఇప్పటికే గుజ్జర్లు, బకేర్వాల్‌లు ఎస్టీ కోటా పొందుతున్నారు. పహారీలను ఎస్టీల్లో చేర్చడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ జైలు DG హేమంత్ లోహియా హత్య..
జమ్ము కశ్మీర్‌లో సోమవారం అర్థరాత్రి ఓ ఘటన చోటు చేసుకుంది. జమ్ముకశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జైళ్లు) హేమంత్ లోహియాను ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని ఇంటి పనిమనిషిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ పోలీసు అధికారి ఒకరు సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఇంటి పనిమనిషి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం