Agnipath Scheme: వారికి సువర్ణావకాశం.. అగ్నిపథ్ స్కీమ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమర్థన
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు.
Agnipath Protest News: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు. మంటల్లో రైళ్లు కాలి బూడిదయ్యాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి నిరసనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గత రెండ్రోజులుగా జరిగిన ఈ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలతో రైల్వే శాఖకు భారీ ఎత్తున నష్టం వాటిళ్లింది. ఇటు సికింద్రాబాద్‌కు అగ్నిపథ్ మంటలు పాకాయి. రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
అయితే దేశ సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చి అగ్నిపథ్ స్కీమ్‌ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Union Minister Rajnath Singh) సమర్థించుకున్నారు. రక్షణ రంగంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పథకం సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. భద్రతా బలగాల్లో గత రెండేళ్లుగా ఉద్యోగ నియామకాలు జరగలేదన్నారు. అందుకే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని మరో రెండేళ్లు పెంచి 23 ఏళ్ల వరకు(ఇది వరకు 21 ఏళ్లుగా ఉండేది) అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు.
#WATCH | For the last 2yrs, young people didn’t get the opportunity to get inducted into Armed forces due to no recruitment process. Thus… govt decided to increase the upper age limit from 21yrs to 23yrs. It’s a one-time relaxation…: Defence Minister Rajnath Singh#Agnipath pic.twitter.com/UfP5z0zakY
— ANI (@ANI) June 17, 2022
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..