TV9 Global Summit Live Video: గ్రాండ్‌గా ప్రారంభమైన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మెగా థాట్ ఫెస్ట్..
వివిధ రకాల థీమ్‌లను కవర్ చేస్తూ, 75 మంది స్టార్ స్పీకర్‌లను హోస్ట్ చేయనుంది టీవీ9 నెట్‌వర్క్. దీంట్లో కేంద్ర మంత్రులు, సీనియర్ ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు ప్రసంగించనున్నారు.
వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ పేరుతో మెగా థాట్ ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది టీవీ9 నెట్‌వర్క్. ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం అయ్యింది. రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, క్రీడా రంగాలపై ఈ సమ్మిట్‌లో చర్చంచనున్నారు. అత్యంత ప్రభావవంతమైన జాతీయ, అంతర్జాతీయ వక్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సమ్మిట్ లక్ష్యం. వివిధ రకాల థీమ్‌లను కవర్ చేస్తూ, 75 మంది స్టార్ స్పీకర్‌లను హోస్ట్ చేయనుంది టీవీ9 నెట్‌వర్క్. దీంట్లో కేంద్ర మంత్రులు, సీనియర్ ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విధాన రూపకర్తలు ప్రసంగించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకోపన్యాసం చేయనున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో రోజు సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. 15 మంది కేంద్ర క్యాబినెట్ మంత్రులు, భారతదేశం కోసం తమ విశ్వగురు విజన్‌ను పంచుకోనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా సమ్మిట్ థీమ్‌పై ప్రసంగిస్తారు. UK మాజీ పీఎం డేవిడ్ కామెరూన్ ఇండియా ఇన్ ది న్యూ ఇంటర్నేషనల్ ఆర్డర్ థీమ్‌పై ప్రసంగించనున్నారు. ఆఫ్ఘనిస్థాన్ మాజీ ప్రధాని హమీద్ కర్జాయ్ టెర్రరిజం ఎనిమీ ఆఫ్ హ్యుమానిటీ అనే అంశంపై ప్రసంగించనున్నారు.