India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా రెండో రోజు 12వేలకు పైగానే కొత్త కేసులు.. మరణాలు ఎన్నంటే..

Corona virus: ఇప్పటికే మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నాలుగో వేవ్‌ అనుమానాలను నిజం చేస్తూ..

India Corona: దేశంలో కరోనా కల్లోలం.. వరుసగా రెండో రోజు 12వేలకు పైగానే కొత్త కేసులు.. మరణాలు ఎన్నంటే..
Coronavirus
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2022 | 10:15 AM

Corona virus: ఇప్పటికే మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నాలుగో వేవ్‌ అనుమానాలను నిజం చేస్తూ దేశంలో భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అంతకుముందు రోజు కుంటే నిన్న ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు 12వేలకు పైగానే కొత్త కేసులు నమోదవ్వడం దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,847 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశం లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 63,063 కు చేరింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 4, 255 కేసులు నమోదుకాగా, కేరళలో 3,419, ఢిల్లీలో 1,323, కర్ణాటకలో 833 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఇక గడిచిన 24 గంటల్లో 14 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,24,817 కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా 7,985 మంది కొవిడ్‌ నుంచి నుంచి కోలు కున్నారు. ఇప్పటివరకు మొత్తం రికవరీ ల సంఖ్య 4,26,82,697 కు చేరింది. ఇక కరోనా కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,27,365 మందికి కొవిడ్‌ టీకాలు వేశాలు. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,95,84,03,471 డోసుల టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..