Corona Virus: మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 4 నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదు.. మరో రెండు ఒమిక్రాన్​ కేసులు గుర్తింపు

మహారాష్ట్ర కరోనావైరస్: మొత్తం కేసులు 79,23,697, తాజా కేసులు 4,255, మరణాల సంఖ్య 1,47,880, కోలుకున్న వారి సంఖ్య 77,55,183, క్రియాశీల కేసులు 20,634 నమోదు కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 8,14,72,916.

Corona Virus: మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. 4 నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదు.. మరో రెండు ఒమిక్రాన్​ కేసులు గుర్తింపు
Coronavirus Cases
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2022 | 6:55 AM

Corona Virus: దేశంలో క్రమంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా నమోదుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24గంటల్లో 4,355 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా… ముగ్గురు మరణించారు. దాదాపు నాలుగు నెలల్లో ఇదే అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన డేటా సూచించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20,000 మార్కును అధిగమించింది. మహారాష్ట్రలో వరసగా రెండో రోజు 4,000 కేసులు నమోదయ్యాయి. బుధవారం, రాష్ట్రంలో 4,024 కేసులు నమోదయ్యాయి.

ఓమిక్రాన్ సబ్-వేరియంట్ 2 కేసులు: 

కొత్తగా రెండు ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు నమోదయయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI)  నివేదిక ప్రకారం.. ఇద్దరు రోగులు నాగ్‌పూర్‌కు చెందినవారిగా తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు 29 ఏళ్ల పురుషుడు, 54 ఏళ్ల మహిళ. ఈ ఇద్దరు బాధితులతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం బీఏ4, బీఏ5 వేరియంట్ కేసుల సంఖ్య 19కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ముంబైలో కోవిడ్ కేసులు: 

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2,366 తాజా COVID-19 కేసులు నమోదు కాగా… ఇద్దరు మృతి చెందారు. రాయ్‌గఢ్ జిల్లాలో గత 24 గంటల్లో శ్వాసకోశ అనారోగ్యంతో మరణించారని.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేని ఏకైక జిల్లా నందుర్బార్ గా పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 79,23,697మంది కొవిడ్ బారినపడగా, వైరస్ వల్ల 1,47,880 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.

 మహారాష్ట్ర కరోనావైరస్ గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి: 

మొత్తం కేసులు 79,23,697, తాజా కేసులు 4,255, మరణాల సంఖ్య 1,47,880, కోలుకున్న వారి సంఖ్య 77,55,183, క్రియాశీల కేసులు 20,634 నమోదు కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 8,14,72,916.

పెరుగుతున్న మరణాలపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుతున్నా.. కరోనాతో మరణాల సంఖ్య గత ఐదు వారాలుగా 4శాతం మేర పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరిన్ని కరోనా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
కొండలా పేరుకుపోతున్న నాన్-క్లెయిమ్ సొమ్ము.. ఎల్ఐసీదే పెద్ద వాటా
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్