Apathy Syndrome: కరోనా ప్రభావంతో పిల్లలపై కొత్త సిండ్రోమ్ దాడి.. పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత.. పెరుగుతున్న చిరాకు
కరోనా వైరస్ మహమ్మారి... ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా రుగ్మతలకు గురిచేస్తోంది. ఆపథీ అనే సిండ్రోమ్ రూపంలో వెంటాడుతోంది. ఆపథీ తో పిల్లల్లో కొత్త లక్షణాలు కన్పిస్తున్నాయి.
కరోనా కల్లోలం తీవ్రత తగ్గినా… దాని పర్యవసానాలు ఏదో రూపంలో వెంటాడుతునే ఉంది. ఇప్పుడు పిల్లలను కొత్త సిండ్రోమ్ వెంటాడుతోంది. ఆపథీ(Apathy) రూపంలో పిల్లలను కొత్త ముప్పు ముంచుకొస్తోంది. చురుకుగా చదివే పిల్లలు సైతం ఈ కొత్త లక్షణాలతో బాధపడుతున్నారు. ఉదాశీనత, నిర్లిప్తతతో పాటు దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం వంటి మానసిక రుగ్మతలు కొందరు పిల్లలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పిల్లల్లో అంతుపట్టని బాధ వెంటాడే అవకాశం ఉందని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఆపథీ లక్షణాలు ఏంటి? మన పిల్లల్ని ఎలా వెంటాడుతున్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..
కరోనా వైరస్ మహమ్మారి… ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా రుగ్మతలకు గురిచేస్తోంది. ఆపథీ అనే సిండ్రోమ్ రూపంలో వెంటాడుతోంది. ఆపథీ తో పిల్లల్లో కొత్త లక్షణాలు కన్పిస్తున్నాయి. ఆసక్తి, ఏకాగ్రతలు తగ్గిపోతున్నాయి. 11శాతం విద్యార్థులకు స్కూల్‌పై ఆసక్తి ,ఏకాగ్రత తగ్గిపోతోందని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో పాఠశాలలు తెరిచారు. కోవిడ్ కారణంగా చాలా కాలంగా పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు స్కూల్స్ తెరిచినా 28శాతం పిల్లలు పాఠశాలకు దూరంగా ఉండే ఆలోచనచేస్తున్నారట. 11శాతం పిల్లలు చదువు పట్ల ఇంట్రస్ట్ చూపించలేకపోతున్నారు. ఇవన్నీ కరోనా కాలంలో ఏర్పడిన మానసిక లక్షణాలే అంటున్నారు వైద్యులు.
కరోనా.. పిల్లలపై అంతగా ప్రభావం చూపించకపోయినా.. పరోక్షంగా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. నాలుగు గోడల మధ్య చదువులు… ఇప్పుడు స్కూల్స్ తెరిచినా సరైన రీతిలో ఆసక్తి చూపించలేకపోతున్నారంటున్నారు. ఇంతకంటే ప్రధానంగా వారిలో ఉదాశీనత, నిర్లప్తత వంటి రుగ్మతలు వెంటాడుతున్నాయి. ఏదో ఒక వయస్సు దాటిన తరువాత వారిలో రావాల్సిన లక్షణాలు వీళ్లపై దాడిచేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… పిల్లల్లో ఏకాగ్రత పోతోంది. వారు చదువుపైనే కాదు..దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారు.
బాగా చదువే పిల్లలు.. సరైన దృష్టిపెట్టలేకపోతున్నారు. కొందరు ఆన్ లైన్ క్లాస్ లను అంతగా అర్థం చేసుకోలేకపోతుంటే.. మరికొందరు స్కూల్ తెరిచిన తరువాత.. వెళ్లమని మారాం చేస్తున్నారు. కొందరు పిల్లల వద్ద తల్లిదండ్రులే కూర్చేనీ ప్రతీదీ చెప్పాల్సిన పరిస్థితి. మరికొందరు పిల్లలకు .. అప్పుడే కొత్తగా స్కూలుకు వెళుతున్నట్లు.. మారాం చేస్తున్నారు. పుస్తకాల సంచీ భుజాన తగిలించి బలవంతంగా పంపించాల్సిన పరిస్థితులు. ప్రతి వంద మంది పిల్లల్లో దాదాపు పదకొండు మంది అంటే ఖచ్చితంగా 10.6శాతం పిల్లల తీరు ఇలాగే ఉందని అనేక అధ్యయనాలు..మానసిక వేత్తలు విశ్లేషణలు స్పష్టంచేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులపై.. సర్వే చేసిన ‘అసద్’ సంస్థ తన 2021 నివేదికలో ఇదే విషయాన్ని తేల్చిచెబుతోంది.
అవును… పిల్లల స్థితిలో మార్పు వచ్చింది… ఇది ఆపథీ లక్షణాలని తల్లితండ్రులకు తెలీకపోయినా… ఏదో మార్పు వచ్చిందని మాత్రం వారు గమనించగలుగుతున్నారు. గతంలో చాలా చురుకుగా ఉండి.. చదువుపై పెట్టే శ్రధ్ద తగ్గిపోతున్నట్లు గమనిస్తున్నామంటున్నారు తల్లితండ్రులు. మరోవైపు.. అప్పటికప్పుడు తాము చేస్తున్న పని నుంచి మరోవైపు మళ్లిపోతున్నారంటున్నారు. ఈ రుగ్మతలు కరోనా సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న పిల్లల్లో మరింత కన్పిస్తోంది. దీంతో వారు పెద్ద వాళ్లలాగానే .. రేపు ఏంటి అనే ఆలోచన, మరోవైపు మార్కుల వెంట పరుగులు. ఇవన్నీ కూడా పిల్లల్లో ఈ మధ్య కనిపిస్తున్న మార్పులకు కారణమని అనుకుంటున్నామంటున్నారు మరికొందరు తల్లితండ్రులు.
కరోనా తెచ్చిన మార్పుల్లో ఇలాంటి మానసికమైన మార్పులు ఒకటంటున్నారు మానసిక వైద్యులు. ఆపథీ, ఏన్హీడోనియా… వంటి మానసిక రుగ్మతలు ప్రధానమైనవంటున్నారు. ప్రధానంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువ గా కన్పిస్తోందంటున్నారు. ఈ కరోనా కాలంలో బయట పడుతున్న డేంజర్ లక్షణాల్లో ఇవొకటంటున్నారు. ముందు ఏన్హీడోనియా నిర్లిప్తత గా ప్రారంభమై… ఆ తర్వాత ఆపథీతో ఉదాశీనతగా మారిపోతోందంటున్నారు. వీటిని ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రి క్లీనికల్ సైకాలజిస్టు డాక్టర్ వెంకట సుబ్బయ్య. కరోనా కాలంలో వస్తున్న అనేక దుష్పరిణామాల్లో పిల్లల్లో అనేక అంశాల్లో ఇన్ ట్రస్ట్ తగ్గుతున్న లక్షణాలు ఈ మధ్యకాలంలో కన్పిస్తున్నాయంటున్నారు ప్రముఖ చైల్డ్ సైకియారిస్టు డాక్టర్ గౌరీదేవి. ఈలక్షణాలు క్రమేణీ పెరుగుతూ పిల్లల్లో వారిలో ఉన్న ఏకాగ్రతను పూర్తిగా దూరంచేస్తాయంటున్నారు ప్రముఖ చైల్డ్ సైకియారిస్టు డాక్టర్ గౌరీ దేవి.
దీనికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. చదువు విషయంలో ఇంటి వద్ద 11.1 శాతం పిల్లలకు సహకారం ఉండటం లేదు. తమకు చదువు పరంగా తల్లిదండ్రులు సహా ఇంట్లోని వారంతా సహకరిస్తున్నారని ప్రభుత్వ విద్యార్థుల్లో 59.4 శాతం మంది, ప్రైవేటు విద్యార్థుల్లో 63.8శాతం మంది పిల్లలు చెప్పారు. కరోనా ఉధృతి తగ్గినా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38.2 శాతం స్కూళ్లే తెరుచుకున్నాయి. 41.2శాతం స్కూళ్లు ఇప్పటి దాకా తెరుచుకోలేదు. మిగతా స్కూళ్లు అన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్ క్లాసులు వింటున్న పిల్లల్లో 22.6 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. 39శాతం మంది సెల్‌ఫోన్ నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 2018లో 45.8 శాతం పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఉండేవి. కరోనాతో ఆన్‌లైన్ చదువులు మొదలు కావడంతో ప్రస్తుతం 79.3 శాతం మంది పిల్లలు ఫోన్లు కలిగివున్నారు. అంటే రాష్ట్రంలో కొత్తగా 34శాతం మందికి స్మార్ట్‌పోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉంది. దేశ వ్యాస్తంగా స్మార్ట్‌ఫోన్లు ఉన్న విద్యార్థులు 67.6 శాతమే ఉన్నారు. మన రాష్ట్రంలో ఫోన్లను విద్య కోసం ఉపయోగిస్తోంది 42శాతం మంది పిల్లలే!
పిల్లలో కనిపిస్తున్న కొత్త లక్షణాలను … ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు మానసిక వైద్యులు. వీటిని తల్లితండ్రులే ముందుగా గుర్తించి.. వాటిని దూరం చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు చైల్డ్ సైకియారిస్టు .ఆపథీ, ఏన్హీడోనియా… వంటి మానసిక లక్షణాలు కన్పించిన వెంటనే… వారు కరోనాకు ముందు ఎలాంటి సాధారణ పరిస్థితుల్లో చదువు.. ఆటలు..పాటల వైపు గడిపారో అలాంటి ఎన్విరాన్ మెంట్ ను కల్పించడం ప్రధానం అంటున్నారు సైకాలజిస్టులు.
ఇప్పటికైనా తల్లితండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలకు కరోనా సోకడం లేదు అన్నంతవరకూ హ్యాపీ, కానీ పిల్లలకు వస్తున్న ఇలాంటి కొత్త మానసిక లక్షణాలను గుర్తించి..వైద్యులను సంప్రదించాల్సిన అవసరం అత్యవసరంగానే కన్పిస్తోంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..