Siachen Glacier: అక్కడ మన ఆర్మీ జవాన్ల జీవితం నిత్యం కత్తిమీద సామే.. సైనికుల త్యాగం గురించి తెలిస్తే గర్వపడతారు

సియాచిన్ దగ్గర పాకిస్తాన్ కంటే మన సైన్యం వేల అడుగుల ఎత్తులో కావలా కాస్తుంది. అయినా సరే నిత్యం భారత ఆర్మీ అలెర్ట్ గా ఉంటుంది. ఇక్కడ మన జవాన్లకు ప్రధాన శత్రువు ప్రకృతే.. ఆక్సీజన్ లెవెల్స్ చాలా దారుణంగా ఉంటాయి కనుక సైనికులు గంటల తరబడి నిద్రపోవడానికి అవకాశం ఉండదు.

Siachen Glacier:  అక్కడ మన ఆర్మీ జవాన్ల జీవితం నిత్యం కత్తిమీద సామే.. సైనికుల త్యాగం గురించి తెలిస్తే గర్వపడతారు
Siachen Glacier
Follow us

|

Updated on: Jun 17, 2022 | 12:01 PM

Siachen Glacier: వేసవిలో అమ్మో వేడి అంటూ.. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు ను ఆశ్రయిస్తాం.. శీతాకాలంలో కొంచెం ఉష్ణోగ్రత తగ్గినా వెంటనే మనం చలినుంచి రక్షణ కల్పించే దుస్తులను ధరిస్తాం. ఒకొక్కసారి చలి నుంచి స్వెటర్లు, మంకీ కాప్స్, మఫ్లర్స్, షాల్స్, గ్లోవ్స్ ఇలా ఎన్ని ధరించినా తక్కువే అనిపిస్తాయి కూడా.. అయితే ఎండకు ఎండుతూ.. వానలకు తడుస్తూ.. గడ్డకట్టే చలిలో వణుకుతూ.. దేశాన్నిరక్షిస్తున్న మన జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేషియర్. ఈ మంచుకొండ భారతీయులకు కొండంత అండ. పాకిస్తాన్ ఆర్మీ నుంచి సియాచిన్ ను కాపాడుకోవడానికి మనం ప్రభుత్వం ఏటా వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తుంటే.. గడ్డకట్టే శీతలంలో మన జవాన్ల సాహసం, త్యాగం  గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈరోజు సియాచిన్ గ్లేషియర్ కొన్ని ఆసక్తికరమైన వాస్తవాల గురించి తెలుసుకుందాం..

సియాచిన్ దగ్గర పాకిస్తాన్ కంటే మన సైన్యం వేల అడుగుల ఎత్తులో కావలా కాస్తుంది. అయినా సరే నిత్యం భారత ఆర్మీ అలెర్ట్ గా ఉంటుంది. ఇక్కడ మన జవాన్లకు ప్రధాన శత్రువు ప్రకృతే.. ఎందుకంటే.. ఇక్కడ శీతాకాలంలోకి పగలు 7గంటలు ఉంటుంది. మిగిలిన 17 గంటలు చిమ్మచీకటి.. గడ్డకట్టే చలి. ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకుపైనే ఉంటుంది.

ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కనుక సైనికులకు అవసరమైన సరకుల సరఫరా చేసే హెలికాఫ్టర్ అక్కడ చేరుకోవడం అంటే ఒక సాహసకార్యక్రమం. పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సకాలంలో ఇక్కడ వస్తువులను సరఫరా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ఆక్సీజన్ లెవెల్స్ చాలా దారుణంగా ఉంటాయి  కనుక సైనికులు గంటల తరబడి నిద్రపోవడానికి అవకాశం ఉండదు. అందుకనే నిద్రపోయే సమయంలో సైనికులను గార్డులు నిద్రలేపుతూ ఉంటారు. లేదంటే జవాన్ల ప్రాణాలు నిద్రలోనే పోయే అవకాశం ఉంది.

తుఫాన్ వంటివి వచ్చే సూచన కనిపిస్తే సైనికులు ఒకరినొకరు తాళ్లతో కట్టివేసుకుంటారు, తద్వారా వారు తుఫానులో కలిసి ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. షేవింగ్ చేసుకుంటే ఒక్కోసారి స్కిన్ తెగిపోయే అవకాశం ఉంటుంది. ఆ గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది.. కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకొక్కసారి శీతల ప్రభావంతో శరీర భాగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి.

పడకలు చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి..కనుక సైనికులు తమ ఖాళీ స్థలాన్ని సామాగ్రి కోసం మాత్రమే ఉపయోగిస్తారు.  వాటినే బెడ్‌లుగా ఉపయోగిస్తారు.

ఇక్కడ ఆఫీస్ మొత్తం ఫైబర్ తోనే ఏర్పాటు చేస్తారు.  స్టీల్ ను తక్కువగా ఉపయోగిస్తారు. ఎప్పుడైనా ఆ స్టీల్ జవాన్ల శరీరానికి తగిలి గాయం అయితే ఆ శరీర భాగాలూ సెన్స్ లెస్ అయ్యి ఒకొక్కసారి ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు.

స్నానం కడగడం కోసం నీటిని కరిగించడానికి 3 గంటలు పడుతుంది. ఇక్కడ ఎక్కువ కాలం నీరు వేడిగా ఉండదు కాబట్టి వారికి స్నానానికి నీటికి సంబంధించి సరైన సౌకర్యాలు లేవు. అయితే ఇక్కడ డ్యూటీ చేసే జవాన్ల శరీరం శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి.

ఎల్లప్పుడు మంచు కురుస్తుంది కాబట్టి. మంచు పడిన వెంటనే సైనికులు ఉండే నాలుగు వైపులా మంచు తొలగించాలి.

ఇక్కడ ఇక్కడ నడిచే వాహనాల విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వెహికల్స్ కి చైన్ వేసి నడుపుతారు లేకుంటే మంచులో స్కిడ్ అయ్యి వెహికల్స్ లోయలలోకి వెళ్ళిపోతాయి.

జవాన్లు అర్ధరాత్రి పెట్రోలింగ్ ని చేపడతారు. ఎందుకంటే ఆ సమయంలో గాలి వేగం తక్కువగా ఉంటుంది. నక్షత్రాల, చందమామ వెలుగులో మంచు కొండ క్లియర్ గా కనపడుతుంది.

హిమానీనదాల రక్షణ కోసం భారతదేశం రోజుకు దాదాపు రూ. 5 నుంచి 7 కోట్లు ఖర్చు చేస్తోంది. గ్లేసియర్‌లో దాదాపు 3000 మంది సైనికులు ఎప్పుడూ విధులు నిర్వహిస్తుంటారు. హిమానీనదాల రక్షణ బాధ్యతను అప్పగించిన ప్రతి సైనికుడు మూడు నెలలపాటు సేవలందిస్తాడు. ఇంతకంటే కఠినమైన వాతావరణ పరిస్థితులను మనిషి తట్టుకోలేడు.

సైనికులు పగలు సమయంలో సూర్యుడ్ని డైరెక్ట్ గా చూస్తే కంటి చూపు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైనికులు సియాచిన్ కు వెళ్ళే సమయంలో మోసే బరువు దాదాపు వాళ్ళ బరువుతో సమానంగా ఉంటుంది.

మరి సియాచిన్ వంటి ప్రాంతంలో తమ ప్రాణాలు, కుటుంబాన్ని లెక్కచేయకుండా కాపలా కాస్తూ.. దేశాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుతున్న మన సైనికుల గురించి తెలిసిందిగా.. మరి జై జవాన్ అంటూ మన సైనికులు చేస్తోన్న త్యాగాలను తలచుకుంటూ గర్వపడదాం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ కొత్త ప్రయోగం.. బాక్స్ ఆఫీస్ వద్ద టాక్.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?