AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt of India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు..

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఇందుకోసం 1570 కోట్ల రూపాయలకు ఆమోదం లభించిందన్నారు. వచ్చే 24 నెలల్లో ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి

Govt of India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశ వ్యాప్తంగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటు..
Nursing College
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 27, 2023 | 9:42 AM

దేశంలో కొత్తగా 157 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న విద్యాసంస్థలతో పాటు ఇవి పనిచేస్తాయిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఇందుకోసం 1570 కోట్ల రూపాయలకు ఆమోదం లభించిందన్నారు. వచ్చే 24 నెలల్లో ఈ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన నర్సింగ్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నైపుణ్యంతో కూడిన నర్సింగ్ సిబ్బంది సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే నర్సింగ్‌ కాలేజీలను వైద్య కళాశాలలతో కలిపి ఉంచడంతో ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, స్కిల్‌ ల్యాబ్‌లు, క్లినికల్‌ సౌకర్యాలు, అధ్యాపక సిబ్బందిని వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఈ 157 కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు రానున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఒక్కో నర్సింగ్ కాలేజీకి రూ. 10 కోట్లు కేటాయించనున్నారు. నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు వైద్య పరికరాల రంగానికి సంబంధించిన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఛత్తీస్ గఢ్ దంతేవాడ ప్రమాదంలో ప్రాణాలు కోల్పయిన వారికి నివాళి అర్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..