AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra BRS ‘మహా’ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ దూకుడు.. చేరికలకు క్యూ కడుతున్న నేతలు..

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నేతలందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. డీఎన్డీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌ రావు అంగళ్వార్‌, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌, బంజారా ఉమెన్‌ అధ్యక్షురాలు రేష్మ చౌహాన్‌, గడ్చిరోలి

Maharashtra BRS ‘మహా’ రాజకీయాల్లో బీఆర్ఎస్‌ దూకుడు.. చేరికలకు క్యూ కడుతున్న నేతలు..
BRS- CM KCR
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2023 | 9:41 AM

Share

మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. నేతలందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. డీఎన్డీ మహారాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌ రావు అంగళ్వార్‌, మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌ సింగ్‌, కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు బల్బీర్‌ సింగ్‌, బంజారా ఉమెన్‌ అధ్యక్షురాలు రేష్మ చౌహాన్‌, గడ్చిరోలి మాజీ జడ్పీ ఛైర్మన్‌ సమ్మయ్య సహా నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

మహారాష్ట్రలో ప్రతీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేతలుంటారు, అన్ని కమిటీలు వేసి మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తామన్నారు సీఎం కేసీఆర్. జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పని మొదలవుతుందన్నారు. ప్రతి గడపను తాకండి, ప్రతీ మనిషిని పలకరించండి అంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. రైతులను ధనవంతులను చేయడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల్లో చైతన్యం రానంత వరకు అభివృద్ధి సాధ్యం కాదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..