AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. అనుమానంతో చెక్ చేస్తే మైండ్ బ్లాక్!

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఈగల్ ఫోర్స్, పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఆటోలోని స్పీకర్ బాక్సులో 6 కిలోల గంజాయిని దాచి తరలిస్తుండగా అరెస్ట్ చేశారు. ఐదుగురిని పట్టుకున్న పోలీసులు, వారి నుంచి లక్ష రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరికి గతంలోనూ గంజాయి కేసులున్నట్లు తేలింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Watch: స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. అనుమానంతో చెక్ చేస్తే మైండ్ బ్లాక్!
Auto Rikshaw Speaker Box
Balaraju Goud
|

Updated on: Aug 17, 2026 | 8:38 PM

Share

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఈగల్ ఫోర్స్, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితులు పోలీసులకు దొరకకుండా గంజాయిని తరలించేందుకు పక్కా ఫ్లాన్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఆటోలోని స్పీకర్ బాక్స్‌ను వినియోగించడం కలకలం రేపింది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నిందితులు గంజాయి కొనుగోలు చేసేందుకు నాగ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ షేక్ సాదిక్ అనే వ్యక్తి నుంచి సుమారు రూ.లక్షకు 6 కిలోల గంజాయిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం గంజాయిని ఆటోలోని స్పీకర్ బాక్స్‌లో దాచి హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నించారు.

సాధారణంగా ఆటోలో ఉండే స్పీకర్ బాక్స్‌ను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో దానిని గంజాయి రవాణాకు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్, పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టి ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీల్లో స్పీకర్ బాక్స్‌లో దాచిన గంజాయి బయటపడటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల్లో హమీద్‌పై గతంలోనూ గంజాయి కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2024లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై కేసు నమోదైనట్లు వెల్లడించారు. తాజాగా గంజాయిని కొనుగోలు చేసేందుకు హమీద్ రూ.లక్ష నగదు చెల్లించినట్లు దర్యాప్తులో గుర్తించారు. గతంలో సుమారు 2 కిలోల గంజాయిని విక్రయించి భారీగా లాభాలు ఆర్జించినట్లు కూడా పోలీసులు తెలిపారు.

ఈ కేసులో గంజాయి సరఫరా, విక్రయాల వెనుక ఉన్న మరికొందరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!