Uttarakhand UCC: ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ చట్టం.. సన్నాహాలు చేస్తున్న ధామి సర్కార్..!
Uttarakhand UCC: యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేబినెట్ మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం శాసన సభ వాయిదా పడిందని, ప్రత్యేక యూసీసీ చట్టం కోసం ఎప్పుడైనా సమావేశం కావచ్చని తెలిపారు.

Uniform Civil Code In Uttarakhand: యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్ర సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేబినెట్ మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం శాసన సభ వాయిదా పడిందని, ప్రత్యేక యూసీసీ చట్టం కోసం ఎప్పుడైనా సమావేశం కావచ్చని తెలిపారు. ఈ సభలో సమాన హక్కుల కోడ్ ముసాయిదాను ఉంచవచ్చు. దీనితో పాటు, అనేక ఇతర బిల్లులను శాసనసభ ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు.
యూసీసీ కమిటీ తన నివేదికను త్వరలో సమర్పించే అవకాశం ఉంది. అంతకుముందే యూసీసీని అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కమిటీ నివేదిక అందిన వెంటనే అమలు దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పడిన యూసీసీ కమిటీ తన నివేదికను ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రికి సమర్పించవచ్చు. ఆ తర్వాత, వచ్చే వారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి, దానిని సభ ముందుంచనున్నారు.
యూనిఫాం సివిల్ కోడ్‌పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. యూసీసీ చట్టం దేశానికి అంత మంచికాదని, అవసరమని భావిస్తే దానిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా మహరా దాసోని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. యూసీసీ, రాష్ట్ర ఆందోళనకారుల రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుందని స్వయంగా సీఎం పుష్కర్ సింగ్ ధామీ వెల్లడించారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలో త్వరలో యూసీసీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు ముగిసిన వెంటనే దీనికి సంబంధించి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పడింది. ఈ కమిటీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఈ కమిటీ నివేదికను ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామికి సమర్పించాల్సి ఉంది. గతంలో యూనిఫామ్ సివిడ్ కోడ్ (UCC)పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగింది. ఉమ్మడి పౌరస్మృతిపై తమ అభిప్రాయాలు సేకరించింది లా కమిషన్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…