Uttarkashi: ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకున్న 40 మంది కూలీలు
సిల్క్యారా నుంచి దండల్‌గావ్ వరకు సొరంగం కూడా నిర్మిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని ఎడిజి ఎపి అన్షుమన్ తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశిలోని ఓ సొరంగంలో హఠాత్తుగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఉత్తర కాశీలో సొరంగంలో 40 మంది కూలీలు చిక్కుకున్నారు. యమునోత్రి జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణాల్లో భాగంగా సిల్క్యారా నుంచి దండల్‌గావ్ వరకు సొరంగం కూడా నిర్మిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదని ఎడిజి ఎపి అన్షుమన్ తెలిపారు. పోలీసు బలగాలతో పాటు SDRF, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో చేరుకుని చర్యలు చేపట్టాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసే పనిలో బృందాలు బిజీగా ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..