Karnataka: ఇంటికి వచ్చిన ఐఫోన్ పార్శిల్.. డబ్బులు లేకపోవడంతో డెలివరీ బాయ్‌ను చంపేసిన కస్టమర్
కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. డెలివరీబాయ్‌ను 20 ఏళ్ల హేమంత్‌దత్ అనే యువకుడు హత్య చేశాడు. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

చంపేయడం.. శవాన్ని ఇంట్లో దాచేయడం.. ఆ తర్వాత ముక్కలుగా నరకడం లేదంటే పెట్రోల్ పోసి అంటించడం…ఇటీవల వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. శ్రద్ధా హత్య కేసు ఇంకా మరువనే లేదు.. అదే తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కర్ణాటకలో జరిగింది మాత్రం కాస్త డిఫరెంట్. యువతలో పెరిగిపోతున్న క్రైమ్ మెంటాలిటీకి ఇదో ఎగ్జాంపుల్. ఐఫోన్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చాడు. డబ్బులు లేక పోతే సింపుల్‌గా .. రిటర్న్ చేయవచ్చు. కానీ హేమంత్ దత్ అనే 20 ఏళ్ల యువకుడు మాత్రం దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు.. ఎక్కడ పరువుపోతుందోనని…ఏకంగా డెలవరీబాయ్‌నే చంపేశాడు. నాలుగు రోజుల పాటు శవాన్ని ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ప్రశ్నించారు. అలా విషయం పోలీసుల వరకూ చేరింది.
ఫిబ్రవరి 7న జరిగింది ఈ ఘటన. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. సాక్ష్యాల కోసం సీసీ ఫుటేజ్‌నంతా జల్లెడ పట్టారు. నిందితుడు హేమంత్‌దత్.. బాటిల్‌లో పెట్రోల్ కొంటున్న దృశ్యాలు లభించాయి.. ఆ ఎవిడెన్స్‌తో తీగ లాగితే డొంక మొత్తం కదిలింది. నిందితుడు హేమంత్‌దత్ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు.. ఈ ఘటన హసన్ జిల్లాలో సంచలనంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం
