Cow Science Exam: గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులను ప్రోత్సహించండి.. వీసీలకు లేఖ రాసిన యూజీసీ
Kamdhenu Gau Vigyan Prachar-Prasar Examination: కామధేను గౌ విజ్ణాన ప్రచార్ ప్రసార్ ( గోశాస్త్రం ) పరీక్ష ఈ నెల 25న జరగనుంది. ఈ గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని..
Kamdhenu Gau Vigyan Prachar-Prasar Examination: కామధేను గౌ విజ్ణాన ప్రచార్ ప్రసార్ ( గోశాస్త్రం ) పరీక్ష ఈ నెల 25న జరగనుంది. ఈ క్రమంలో గోశాస్త్రం పరీక్ష రాసేలా విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. విశ్వవిద్యాలయాల వైస్-ఛాన్స్‌లర్లను కోరింది. ఫిబ్రవరి 25న జరిగే గోశాస్త్రం పరీక్షకు స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా.. అదేవిధంగా రాసేలా ప్రోత్సాహించాలని వీసీలకు యూజీసీ సెక్రెటరీ రజ్నీష్ జైన్ ప్రత్యేకంగా లేఖలు రాశారు. గోశాస్త్రంపై నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా, రాసేలా విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థులను ప్రోత్సహించాలని.. దీంతోపాటు ఈ పరీక్షకు విశేష ప్రచారం కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు.
పశుసంవర్ధక శాఖ సహకారంతో రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఈ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనుంది. భారతీయ ఆవు.. ఆర్థిక, శాస్త్రీయ, ఆరోగ్య, వ్యవసాయ, పర్యవరణ, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఈ పరీక్షను అన్ని భాషల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ పేర్కొంది. గంటసేపు జరిగే ఈ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ పద్దతిలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
Also Read: