West Bengal: బెంగాల్ కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబులతో దాడి.. తీవ్ర గాయాలు
West Bengal Labour Minister injured in bomb attack: పశ్చిమ బెంగాల్ కార్మికశాఖ మంత్రి జకీర్ హుస్సేన్‌పై కొంతమంది వ్యక్తులు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో మంత్రి జాకీర్ హుస్సేన్‌కు..
West Bengal Labour Minister injured in bomb attack: పశ్చిమ బెంగాల్ కార్మికశాఖ మంత్రి జకీర్ హుస్సేన్‌పై కొంతమంది వ్యక్తులు బాంబులతో దాడిచేశారు. ఈ దాడిలో మంత్రి జాకీర్ హుస్సేన్‌కు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం రాత్రి పశ్చిమ బెంగాల్ మంత్రి జాకీర్ హుస్సేన్ కోల్‌కతాకు వెళ్లేందుకు బయలుదేరారు. రైలు ఎక్కేందుకు ఆయన నిమ్టితా స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళుతుండంగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబులతో దాడి చేశారు. దీంతో ఆయనతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇదిలాఉంటే.. బాంబు దాడిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. నిమ్టితా రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు దాడిని తాను ఖండిస్తున్నానని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ గోయల్ ఆకాంక్షించారు. జాకీర్ హుస్సేన్ ముర్షిదాబాద్ జిల్లాలోని జంగిపూర్ నియోజవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Also Read: