Prashant Bhushan: కోవిద్ వ్యాక్సిన్లపై సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్స్… నిపుణుల ఆగ్రహం
కోవిద్ వ్యాక్సిన్లపై సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. కోవిద్ అదుపునకు ఉద్దేశించిన ఈ టీకామందులు సందేహాస్పదంగా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ట్విటర్ సైతం పేర్కొంది.
కోవిద్ వ్యాక్సిన్లపై సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్స్ దుమారం రేపాయి. కోవిద్ అదుపునకు ఉద్దేశించిన ఈ టీకామందులు సందేహాస్పదంగా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పక్కదారి పట్టించేవిగా ఉన్నాయని ట్విటర్ సైతం పేర్కొంది. వ్యాక్సిన్ల సేఫ్టీ, వాటి నాణ్యతపై ప్రశాంత్ భూషణ్ వెలిబుచ్చిన అభిప్రాయాల మీద దేశ వ్యాప్తంగా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.అసలే టీకామందులపై దేశంలో పలు చోట్ల ప్రజల్లో ఇంకా అనుమానాలు, అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న ఈ సమయంలో ఇలాంటి స్టేట్ మెంట్లు సరి కావని కోవిద్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డా. ఎన్.కె. అరోరా అన్నారు. ఇవి తప్పుడు అభిప్రాయాలకు ఆస్కారం కలిగిస్తాయన్నారు. కోవిద్ కారణంగా ఆరోగ్యవంతులైన యూత్ తీవ్ర అస్వస్థతకు గానీ..మృతి చెందడానికి గానీ అవకాశాలు ఏ మాత్రం లేవని, నిజానికి వ్యాక్సిన్ల కారణంగానే వారు మరణించడానికి ఛాన్సులు ఉన్నాయని ప్రశాంత్ భూషణ్ తన ట్వీట్స్ లో పేర్కొన్నారు. కోవిద్ నుంచి కోలుకున్నారంటే అది వారి సహజ రోగ నిరోధక శక్తి వల్లేనని..వ్యాక్సిన్ కన్నా ఈ శక్తే పవర్ ఫుల్ అన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. పైగా టీకామందులు నిరోధక శక్తిని (ఇమ్యూనిటీని) తగ్గిస్తే తగ్గించవచ్చు కూడా అని ఆయన అన్నారు.
అయితే ఇవి ఆ లాయర్ చేసిన ప్రకటనలే తప్ప తమకు సంబంధం లేదని ట్విటర్ తమ డిస్ క్లెయిమర్ లో వివరించింది. ఈ ట్వీట్స్ తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని…ప్రజలకు వ్యాక్సిన్లు సేఫ్ అని ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు చెబుతున్నారో పరిశీలించాలని ఇందులో పేర్కొంది. కాగా తన వ్యాఖ్యలపై దుమారం రేగగా..ప్రశాంత్ భూషణ్ నాలుగు పేజీల స్టేట్ మెంట్ లో తన వైఖరిని వివరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Congress: అసమ్మతి రాగం.. అసంతృప్తి తాళం.. ఇవే పీసీసీ కొత్త బాస్ ముందున్న సవాళ్లు..
Traffic Challan: మొత్తం 131 చలాన్లు.. ఫైన్ విలువ రూ. 36వేలు.. ఈ ఉల్లంఘలన్నీ ఒకే బైక్‌వీ..