TV9 WITT Summit: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు.. టీవీ9 సమ్మిట్ లో సీఎం కేజ్రీవాల్
టీవీ నెట్ వర్క్ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) రెండో ఎడిషన్ ముగిసింది. మొత్తం 3 రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 28) నాటి పవర్ కాన్ఫరెన్స్ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు
టీవీ నెట్ వర్క్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) రెండో ఎడిషన్ ముగిసింది. మొత్తం 3 రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 27) నాటి సత్తా సమ్మేళన్ సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి తనపై వస్తోన్న ఆరోపణలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీనిని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆపరేషన్ లోటస్‌ను అమలు చేసేందుకు బీజేపీ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే మేం గట్టిగానే నిలబడ్డాం. ప్రజలు మా వైపే ఉన్నారు. మాకు అండగా నిలిచారు. ఎందుకంటే మేం ఎలాంటి స్కామ్ లు చేయలేదు. ఎలాంటి తప్పులూ చేయలేదు’ అని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
‘కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మేం బాగా అభివృద్ధి చేయగలం. దేశంలోని అన్ని ప్రభుత్వాలు నష్టాల్లో నడుస్తున్నాయి. కానీ కేవలం ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే లాభాల్లో నడుస్తోందని కాగ్ నివేదించింది. మా ప్రభుత్వంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవు ‘ అని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన ఇంకేం మాట్లాడారో ఈ కింది వీడియోలో చూడండి.