News9 Global Summit: న్యూస్‌9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పాల్గొననున్న 200 మంది ప్రముఖులు..

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించిన TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 .. ఇప్పుడు జర్మనీ లోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సదస్సులో ప్రధాని మోదీ కూడా ప్రసంగిస్తారు. ఇలాంటి సదస్సును ఓ మీడియా సంస్థ నిర్వహించడం చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది..

News9 Global Summit: న్యూస్‌9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం.. పాల్గొననున్న 200 మంది ప్రముఖులు..
News9 Global Summit
Follow us
Shaik Madar Saheb

| Edited By: TV9 Telugu

Updated on: Nov 20, 2024 | 5:47 PM

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌నకు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్‌‌ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినాలో ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.. TV9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌ దాస్‌ అధ్యక్షతన జరిగే మూడు రోజుల న్యూస్9 భారత్‌-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. రెండవరోజు.. ‘‘ఇండియా: ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్’’ అంశంపై అంతర్జాతీయ భాగస్వామ్యాల బలోపేతం, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారత్ ప్రభావం.. పాత్ర.. దూర దృష్టి తదితర విషయాలను ప్రధాని మోదీ పంచుకోనున్నారు. గురువారం సదస్సు ప్రారంభం కానుంది.. మూడు రోజులపాటు న్యూస్‌9 ఆధ్వర్యంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ జరగనుంది..

భారత్‌-జర్మనీ దేశాల మధ్య మైత్రీ.. వాణిజ్య , ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోపాటు.. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది..

ఈ సమ్మిట్‌లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అలాగే జర్మనీ మంత్రులు, ప్రతినిధులు పాల్గొననున్నారు. వారితో పాటు పలువురు రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు చర్చలో పాల్గొని అభిప్రాయాలను పంచుకోనున్నారు.

మొత్తంగా ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌లో పలు రంగాలకు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. స్టుట్‌గాట్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియం ఈ సదస్సుకు వేదిక కానుంది.

ప్రజాస్వామ్య దేశాలైన భారత్, జర్మనీ మధ్య.. ఇప్పటికే.. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య, సాంస్కృతిక, సాంకేతిక సహకారం బలంగా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ ఈ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు దోహదపడనుందని..అంతేకాకుండా భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో..

గత ఫిభ్రవరిలో న్యూస్‌ -9 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియా-జర్మనీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జర్మనీలో కూడా సదస్సును నిర్వహిస్తున్నారు. స్టుట్‌గార్డ్‌ నగరం బెంజ్‌ కార్ల తయారీతో పాటు ఫుట్‌బాల్‌కు చాలా ప్రసిద్ది. భారత్‌ను కూడా ఫుట్‌బాల్‌ రంగంలో తీర్చిదిద్దేందుకు TV9 గ్రూప్‌ నడుంబిగించిది.. ఈ మేరకు టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే..

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ మూడు రోజుల కార్యక్రమాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..