TV9 Festival Of India: నాలుగో రోజుకు చేరుకున్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. కలర్‌ఫుల్ ఈవెంట్స్‌తో..
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ' టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' నాలుగో రోజుకు చేరుకుంది. ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ కళాకారులచే వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఫెస్టివల్‌లోని మూడో రోజు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ధ్యాన్‌చంద్ స్టేడియంకు చేరుకొని దుర్గాదేవి ఆశీస్సులు అందుకున్నారు.

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘ టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ నాలుగో రోజుకు చేరుకుంది. ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ కళాకారులచే వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఫెస్టివల్‌లోని మూడో రోజు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు ధ్యాన్‌చంద్ స్టేడియంకు చేరుకొని దుర్గాదేవి ఆశీస్సులు అందుకున్నారు. అక్టోబర్ 24న ఈ ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమం చివరి రోజు కాగా.. ప్రజలు తమ కుటుంబ సమేతంగా విచ్చేసి.. దుర్గాదేవి ఆశీస్సులు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఢిల్లీలో అతిపెద్ద దుర్గా విగ్రహాన్ని ఈ TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలోనే ఏర్పాటు చేశారు.
మరోవైపు ఆదివారం దుర్గాదేవిని దర్శించుకునేందుకు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనెట్, బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది వారి కుటుంబాలతో కలిసి వచ్చారు. అలాగే ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ కూడా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. గాయని మైథిలీ ఠాకూర్ గానామృతం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అక్టోబర్ 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి జనాలు అత్యధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా.. అనంతరం దాండియా ఆడుతూ తమ సమయాన్ని గడిపారు.
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతోన్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు అందరికీ ప్రవేశం ఉంది. లైవ్ మ్యూజిక్ షో, చిన్నపిల్లల నృత్యం.. ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అక్టోబర్ 24న చివరి రోజు కాగా.. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు నిర్వాహకులు. కాగా, ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రజలకు టూ, ఫోర్ వీలర్ పార్కింగ్ కూడా ఉచితమే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
