AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: బైక్ నడిపేవారు జాగ్రత్త! వేల మంది లైసెన్సులు రద్దు.. మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతి..!

Traffic Rules: మీరు కూడా బైక్‌ నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఒక పొరపాటు మీ లైసెన్స్ రద్దుకు దారి తీస్తుంది. ఇది కాకుండా మీరు జరిమానా..

Traffic Rules: బైక్ నడిపేవారు జాగ్రత్త! వేల మంది లైసెన్సులు రద్దు.. మీరు ఈ తప్పులు చేస్తే అంతే సంగతి..!
Traffic Rules
Subhash Goud
|

Updated on: Sep 04, 2022 | 6:11 PM

Share

Traffic Rules: మీరు కూడా బైక్‌ నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఒక పొరపాటు మీ లైసెన్స్ రద్దుకు దారి తీస్తుంది. ఇది కాకుండా మీరు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. నిజానికి గత రెండు వారాలుగా ఒడిశాలో ప్రత్యేక ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా 12 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసి రూ.60 లక్షలకు పైగా జరిమానా వసూలు చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా చేపట్టనున్నారు. ఇక హైదరాబాద్‌లో వాహనదారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆగస్టు 16 నుంచి ఆగస్టు 30 వరకు హెల్మెట్ లేని వాహనదారులకు రాష్ట్ర రవాణా సంస్థ (ఎస్‌టీఏ) అధికారులు 24,474 ఈ-చలాన్‌లు జారీ చేశారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు గానూ మొత్తం 888 వాహనాలను సీజ్ చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ఒక కారణమని ఓ అధికారి తెలిపారు. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1,308 మంది డ్రైవర్లు, రైడర్లు మరణించగా, వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించలేనివారున్నారని తెలిపారు. వాహనదారుల నుంచి రూ.63.98 లక్షలు జరిమానాగా వసూలు చేశారు పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినందుకు 12,545 లైసెన్స్‌లను సస్పెండ్ చేసిందని ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే వాహనదారులకు డ్రైవింగ్‌ లైసెన్స్ లేకపోతే కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీగా జరిమానాతో పాటు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ఢిల్లీలో రూ.5000 చలాన్ ఉంది. చలాన్ జరిమానా తర్వాత, మీ స్వంత భద్రత కోసం హెల్మెట్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు..

ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా వాహనదారులపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హెల్మెట్‌ లేకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి ప్రతిరోజు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు, జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అందుకే వాహనాలు నడిపే వారు తప్పకుండా హెల్మె్‌ట్‌తో పాటు లైసెన్స్‌ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే. అలాగే ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇప్పటికే నగరంలో చాలా మంది వాహనదారుల లైసెన్స్‌లు సైతం రద్దు అయ్యాయి. జరిమానాలు, శిక్షలు కూడా పడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి