Driving Rules: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. కాదంటే అడ్డంగా బుక్కైనట్లే..!

దేశంలో కొన్నేళ్లుగా ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ నిబంధనలను కఠినతరం చేశారు. ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ప్రమాదాల్లో..

Driving Rules: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు.. కాదంటే అడ్డంగా బుక్కైనట్లే..!
Traffic Rules
Follow us

|

Updated on: Mar 20, 2023 | 7:30 AM

దేశంలో కొన్నేళ్లుగా ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ నిబంధనలను కఠినతరం చేశారు. ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ట్రాఫిక్ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రాణాపాయరీతిలో, నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయడంతో పాటు.. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వాహనాలను నడుపుతున్నారు. డ్రైవింగ్ నిబంధనలు తెలియకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అయితే, ఈ మధ్య కాలంలో పోలీసులే పట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ట్రాఫిక్ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పోలీసులు ట్రాఫిక్ చలాన్లను వేస్తున్నారు. అలా చాలా మంది వాహనదారులకు వేలాది రూపాయల చలాన్లు పంపడం జరుగుతుంది. మరి ఈ చలాన్ల నుంచి ఈజీగా తప్పించుకునే మార్గాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెడ్ లైట్ జంప్..

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఖచ్చితంగా ఆగాల్సిందే. ట్రాపిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడితే.. ఖచ్చితంగా జీబ్రా క్రాసింగ్ వెనుక ఆగాలి. జీబ్రా క్రాసింగ్ ముందు ఆగితే. అక్కడి సీసీకెమెరా మీ వాహనం నెంబర్‌ను క్లిక్‌మనిపిస్తుంది. చలాన్ పడుతుంది. అందుకే జీబ్రాక్రాసింగ్ లైన్‌కు ముందే వాహనాన్ని ఆపి.. చలాన్ పడకుండా చూసుకోవాలి.

హెల్మెట్ తప్పనిసరి..

బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ఇది ప్రమాద సమయంలో ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో తలకు బలమైన గాయం అవదు. తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుంటే ట్రాపిక్ కూడళ్ల వద్ద గానీ, పోలీసులు గానీ తమ కెమెరాలతో ఫోటో తీసి చలాన్ వేసే అవకాశం ఉంది. అందుకే హెల్మెట్ తప్పకుండా ధరించి మీ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు, చలాన్ పడకుండా చూసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ట్రిపుల్ రైడింగ్ వద్దు..

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. బైక్‌పై ముగ్గురు కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అమర్చిన కెమెరా కళ్లకు చిక్కడం ఖాయం. అలాంటి పరిస్థితుల్లో భారీ జరిమానా కట్టక తప్పని పరిస్థితి ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!