India Corona Updates: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి.. ఎంత మంది మరణించారంటే.
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా...
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 58,578 మంది కరోనా బారినపడ్డారు. అటు కరోనా బారినపడి ఆదివారం ఒక్కరోజే 979 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
కాగా, ఆదివారం కరోనా నుంచి 2.93 లక్షల మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 24 గంటల్లో కరోనాతో చనిపోయిన 979 మందితో కలిపి మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,96,730కు చేరింది. దేశంలో ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 3,02,79,331కు చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి.