TMC MP Nusrat Jahan: భారతీయ సంస్కృతిని ఎంపీ నస్రత్ జహాన్ అవమానించారు.. ఎంపీ పదవికి అనర్హురాలు.. స్పీకర్‌కు బీజేపీ ఎంపీ లేఖ
భారతీయ సంస్కృతిని అవమానించిన టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు.
BJP seeks TMC MP Nusrat Jahan: భారతీయ సంస్కృతిని అవమానించిన టీఎంసీ ఎంపీ నస్రత్ జహాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నుదుట సిందూరం పెట్టుకున్న నస్రత్ ఓ వ్యక్తిని వివాహం చేసుకుని తన భర్తగా పేర్కొంటూ వివాహ విందు ఏర్పాటు చేశారని, దానికి సీఎం మమతను కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. ఇప్పుడేమో అతడితో తనకు పెళ్లే జరగలేదని చెబుతున్నారని, ఇది భారతీయ సంస్కృతిని అవమానించడమేనని అన్నారు. ఆమె కనుక తన పదవికి రాజీనామా చేయకుంటే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ భారతీయ సంస్కృతిని అవమానించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బుధవారం ఆరోపించారు. ఆమె వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకపోతే ఆమెను పదవి నుంచి తొలగించాలని టీఎంసీని డిమాండ్ చేశారు.
మరోవైపు ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య మంగళవారం లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు ఓ లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన వైవాహిక హోదా గురించి పార్లమెంటుకు తప్పుడు ప్రమాణ పత్రాన్ని సమర్పించారని తెలిపారు. ఆమెను ఆ పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను టర్కీలో వివాహం చేసుకున్నట్టు గతంలో ప్రకటించిన నస్రత్.. ఇటీవల తమ బంధం దెబ్బతిన్నట్టు ప్రకటించినప్పటి నుంచి రాజకీయంగా వివాదం చుట్టుముట్టింది. నుస్రత్ జహాన్ జూన్ 9న విడుదల చేసిన ప్రకటనలో తనకు నిఖిల్ జైన్‌తో వివాహ బంధం దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఆమె బసీర్‌హట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ వివాహ నిబంధనల ప్రకారం టర్కీలో జరిగిందని, దానిని భారత దేశంలో రిజిస్ట్రేషన్ చేయించలేదని, అందువల్ల తమ వివాహం భారత దేశంలో చెల్లుబాటు కాదని వివరించారు. నిఖిల్ జైన్‌తో టర్కీలో వివాహమైందని చెప్తూ, కోల్‌కతాలో విందు ఇచ్చారు. ఈ విందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ హాజరయ్యారు.