Tirumala Laddu: సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వ్యవహారం.. ఇంతకీ పిటిషన్లు ఎవరెవరు వేశారంటే..?

కలియుగ దైవంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు విలువ చేసే కానుకలు ఆయనకు అందుతూ ఉంటాయి.

Tirumala Laddu: సుప్రీంకోర్టుకు చేరిన తిరుమల లడ్డు వ్యవహారం.. ఇంతకీ పిటిషన్లు ఎవరెవరు వేశారంటే..?
Tirupati Laddu
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 29, 2024 | 11:22 AM

కలియుగ దైవంగా ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. నిత్యం కోట్లాది రూపాయలు విలువ చేసే కానుకలు ఆయనకు అందుతూ ఉంటాయి. అత్యంత ఆదాయం కలిగిన ఆలయాల్లో తిరుమల మొదటి స్థానంలో ఉంటుందని చెప్పొచ్చు. వీటన్నింటికీ మించి స్వామివారి ‘ప్రసాదం’ లడ్డుకు ఎంతో విశిష్టత, ప్రాధాన్యత ఉంది. సామాన్యుడి నుంచి ప్రధాన మంత్రి వరకు ఈ లడ్డు ప్రసాదం కోసం వెంపర్లాడుతూ ఉంటారంటే అతిశయోక్తి కాదు..!

స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే ఈ లడ్డు రుచి అలాంటిది. అలాంటి ‘లడ్డు’ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న వార్త ప్రపంచవ్యాప్త హిందూ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మరీ ముఖ్యంగా ఆ కల్తీకి పశువుల కొవ్వు, చేప నూనె, పంది కొవ్వు వంటివి కూడా ఉపయోగించారని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం, అందుకు సాక్ష్యంగా గుజరాత్‌లోని నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ల్యాబ్ రిపోర్టును విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. గత ప్రభుత్వ హయాంలో మార్చిన టెండర్ నిబంధనలు, నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందిన సంస్థల్లో తమిళనాడుకు చెందిన ‘ఏఆర్ ఫుడ్స్’ సరఫరా చేసిన నెయ్యిలో ఈ కల్తీ జరిగిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది.

ఇదంతా అబద్ధమని, టీటీడీకి సరఫరా చేసే నెయ్యిని పరీక్షించి నాణ్యత లేదని తేలితే వెనక్కి పంపించేలా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయని, కల్తీ నెయ్యిని వినియోగించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) చెబుతోంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతెలా ఉన్నా.. ఎంతో ప్రాశస్త్యం, విశిష్టత కల్గిన స్వామి వారి లడ్డు ప్రసాదం విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. కొందరు ఏకంగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అలా దాఖలైన 5 పిటిషన్లలో కొన్నింటిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వాటిని సోమవారం (సెప్టెంబర్ 30) నాటి విచారణ జాబితాలో చేర్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఇంతకీ ఆ 5 పిటిషన్లు ఏంటి? వాటిని దాఖలు చేసిందెవరు?

సురేశ్ ఖండేరావు చౌహాన్కే

లడ్డు వివాదం మొదలైన వెంటనే స్పందించిన వ్యక్తి సురేశ్ ఖండేరావు చౌహాన్కే. ఓ ప్రైవేట్ హిందీ ఛానెల్‌కు ఎడిటర్‌గా పనిచేస్తున్న సురేశ్ ఖండేరావు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రూపంలో పిటిషన్ (లెటర్ పిటిషన్) పంపించారు. అత్యంత పవిత్ర ఆలయంలో తయారయ్యే లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వు కలవడం రాజ్యాంగంలో 25, 26 అధికరణల ప్రకారం భక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడంతో పాటు, మతస్వేచ్ఛకు విఘాతం కల్గించడమేనని లెటర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

సూర్జిత్ సింగ్ యాదవ్

‘హిందూ సేన’ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న సూర్జిత్ సింగ్ యాదవ్ తిరుపతి లడ్డు వ్యవహారంపై ఓ పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ నెయ్యి అంశంపై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. నెయ్యిని పశువుల కొవ్వుతో కల్తీ చేయడం యావత్ హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని, హిందువుల మనోభావాలు గాయపడ్డాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

డా. సుబ్రమణియన్ స్వామి

స్వపక్షంపై పదునైన విమర్శలతో తరచు వార్తల్లో ఉండే సీనియర్ బీజేపీ నేత డా. సుబ్రమణియన్ స్వామి కూడా లడ్డు వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం ఉండకూడదని, ఏ ఇతర మత సంస్థలపైనా ప్రభుత్వ పెత్తనం లేనప్పుడు హిందూ ఆలయాలపై మాత్రం ఎందుకని ప్రశ్నిస్తూ ఆయన గతంలోనూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ ఆలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలని ఆ పిటిషన్లో కోరారు. తాజా పిటిషన్‌లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే నెయ్యి కల్తీ జరిగిందంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర నివేదిక తెప్పించాలని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కల్తీ వ్యవహారంపై ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (TTD) స్థాయిలో అంతర్గతంగా తేల్చాల్సిందని, కానీ దీన్ని రాజకీయం చేస్తూ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి నాణ్యతలో విఫలమైతే దాన్ని వెనక్కు పంపే ఏర్పాటు ఉండాలని పేర్కొన్నారు. ఆయన కొన్ని మౌలిక ప్రశ్నలను లేవనెత్తారు.

  • శాంపిళ్లను ల్యాబ్ టెస్టింగ్ ఏజెన్సీ సేకరించిందా?
  • తిరస్కరించిన ట్యాంకర్ నుంచి శాంపిళ్లను సేకరించారా లేక ప్రసాదంలో వినియోగించిన నెయ్యి నుంచి శాంపిళ్లను సేకరించారా?
  • కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థ ఏది?
  • సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించి కల్తీ జరిగిందని టీటీడీ ఎప్పుడు గుర్తించింది?
  • టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టులను విడుదల చేయడంలో రాజకీయ జోక్యం అనుమతించదగినదా?

వైవీ సుబ్బారెడ్డి

సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినవారిలో టీటీడీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. కోర్టు పర్యవేక్షణలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి ఈ లడ్డు ప్రసాదం కల్తీ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అదే సమయంలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిళ్లను సేకరించి ల్యాబ్ టెస్టింగ్ చేసేలా అక్కడ ఒక వ్యవస్థ ఉందని, ఆ పరీక్షలో పాసైతే ట్యాంకర్ లోపలకి వస్తుందని, లేదంటే వెనక్కి తిరిగి పంపిచేస్తారని వివరించారు. ప్రాథమిక పరీక్షణలో నాణ్యత లేదని తేలితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ట్యాంకర్‌ను లోపలకు అనుమతించే ప్రసక్తే ఉండదని పేర్కొన్నారు. అలాంటప్పుడు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని చెప్పడం సరికాదని వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్లో ప్రస్తావించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంలో పశువుల కొవ్వుతో కల్తీ జరిగిన నెయ్యిని వినియోగించారని చెప్పడంతో కోట్ల సంఖ్యలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనకు, టీటీడీ ఈవో ప్రకటనకు మధ్య వ్యత్యాసం ఉందని కూడా పిటిషన్లో ప్రస్తావించారు. మరోవైపు జులై నెలలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే, 2 నెలలపాటు మౌనం వహించి సెప్టెంబర్‌లో దాన్ని బహిర్గతం చేయడంపై కూడా సుబ్బారెడ్డి సందేహాలు లేవనెత్తారు.

డా. విక్రమ్ సంపత్, దుశ్యంత్ శ్రీధర్

లడ్డు ప్రసాదం వివాదంపై చరిత్రకారుడు డా. విక్రమ్ సంపత్, ఆధ్యాత్మికవేత్త దుశ్యంత్ శ్రీధర్ సంయుక్తంగా ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆలయాల నిర్వహణలో ప్రభుత్వాల జోక్యం, పెత్తనం నివారించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాల నియంత్రణలో ఉన్న ఆలయాల విషయంలో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

మొత్తం ఈ 5 పిటిషన్లలో డా. సుబ్రమణియన్ స్వామి, వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం నాటి విచారణ జాబితాలో కనిపించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తెలంగాణ పల్లెల్లో పోటాపోటీగా విచిత్రమైన దసరా ఆఫర్లు..
తెలంగాణ పల్లెల్లో పోటాపోటీగా విచిత్రమైన దసరా ఆఫర్లు..
సీక్రెట్ రూంతో అసలు ట్విస్ట్.. సోనియా ఎలిమినేట్..
సీక్రెట్ రూంతో అసలు ట్విస్ట్.. సోనియా ఎలిమినేట్..
ఐదు రోజులుగా పరారీలోనే.. యూట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ..?
ఐదు రోజులుగా పరారీలోనే.. యూట్యూబర్‌ హర్షసాయి ఎక్కడ..?
సుప్రీంకోర్టు మెట్లెక్కిన తిరుమల వెంకన్న లడ్డూ..!
సుప్రీంకోర్టు మెట్లెక్కిన తిరుమల వెంకన్న లడ్డూ..!
ధోని కోసం రూల్స్ ఛేంజ్.. ఐపీఎల్‌ 2025లో మరోసారి 'మహి' మ్యాజిక్..
ధోని కోసం రూల్స్ ఛేంజ్.. ఐపీఎల్‌ 2025లో మరోసారి 'మహి' మ్యాజిక్..
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించిన మృణాల్‌.. 'అది కూడా చూడాలంటూ'..
రణ్‌బీర్‌పై ప్రశంసలు కురిపించిన మృణాల్‌.. 'అది కూడా చూడాలంటూ'..
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
సొంతంగా రూ.345 కోట్లు కూడబెట్టిన స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
హిట్టా.? ఫట్టా.? కార్తీ vs అరవింద స్వామి.. సత్యం సుందరం అదుర్స్.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
దిమ్మతిరిగేలా ఎన్టీఆర్ ఓపెనింగ్.. కలెక్షన్స్ జాతరంటే ఇది.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
రూ.172 కోట్ల దేవర రికార్డ్‌ | కల్కీ సినిమాకు మరో అరుదైన గౌరవం.!
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
భాగ్యనగరంలో పింక్ పవర్ రన్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..