AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi – Mann Ki Baat: మరో మైలురాయిని చేరుకోనున్న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’.. స్పెషల్ ఏంటంటే..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతినెలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌.. మరో మైలురాయిని అందుకోనుంది. 2014లో ప్రారంభమైన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మూడు రోజుల్లో దశాబ్దంలోకి అడుగుపెట్టనుంది.. ఇవాళ 114వ ఎపిసోడ్ ప్రాసారం కానుంది. మోదీ రేడియో ద్వారా ప్రజలతో పంచుకునే ఈ ప్రొగ్రామ్ కు ఎంతగానో ప్రాముఖ్యత ఉంది..

PM Modi - Mann Ki Baat: మరో మైలురాయిని చేరుకోనున్న ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’.. స్పెషల్ ఏంటంటే..
Pm Modi Mann Ki Baat
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Sep 29, 2024 | 10:01 PM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతినెలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌.. మరో మైలురాయిని అందుకోనుంది. 2014లో ప్రారంభమైన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మూడు రోజుల్లో దశాబ్దంలోకి అడుగుపెట్టనుంది.. ఇవాళ 114వ ఎపిసోడ్ ప్రాసారం కానుంది. మోదీ రేడియో ద్వారా ప్రజలతో పంచుకునే ఈ ప్రొగ్రామ్ కు ఎంతగానో ప్రాముఖ్యత ఉంది.. ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌ ప్రారంభమై.. 9 సంవత్సరాలు పూర్తయి.. 10 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నేటి #MannKiBaat ప్రత్యేకమైనది.. ఈ ఐకానిక్ ప్రోగ్రామ్ పదేళ్లలోకి అడుగుపెట్టడాని సూచిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ట్యూన్ చేయండి!.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అప్పటినుండి ప్రధాని మోదీ మనసులోని మాటలను మన్ కి బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారు.

ప్రధాని మోదీ ట్వీట్..

ప్రతీనెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ప్రోగ్రాం జనబాహుళ్యానికి ఎంతగానో దగ్గరైంది. దేశ ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ప్రజలతో పలు విషయాలపై ముచ్చటిస్తారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో జరిగే అంశాలపై కూడా ప్రస్తావిస్తుంటారు. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలు సహా అనేక విషయాలను ప్రధాని మోదీ ప్రజలతో పంచుకుంటూ వస్తున్నారు. మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రోగ్రామ్‌.. ఇవ్వాల్టితో పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.

మోదీ మన్ కీ బాత్.. లైవ్ వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!