ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌.. గత 3 ఏళ్లలో 11మంది బలి

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చిచ్‌పల్లి అటవీ పరిధిలో గత మూడేళ్లుగా 11 మందిని చంపిన పులిని విజయవంతంగా బోనులో బంధించినట్లు అధికారులు తెలిపారు. గతంలో అటవీ శాఖ బోనులను ఏర్పాటు చేసినప్పటికీ ఈ పులి చౌకచక్యంగా తప్పించుకుందని చెప్పారు.

ఎట్టకేలకు బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌.. గత 3 ఏళ్లలో 11మంది బలి
Tigress
Follow us

|

Updated on: Sep 29, 2024 | 2:55 PM

మహారాష్ట్రలో గత 3 ఏళ్లలో ఏకంగా 11 మంది ప్రాణాలు తీసింది ఈ మ్యాన్ ఈటర్. ప్రమాదకర టీ-83 అనే పెద్ద పులిని ఎట్టకేలకు బోనులో చిక్కింది. మత్తుమందు ఇచ్చి పులిని బంధించారు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు, సిబ్బంది. చంద్రపూర్‌ జిల్లా మూల్‌ తాలూకా చిచ్పల్లి అటవీక్షేత్రంలో పన్నిన బోనులో ఈ మ్యాన్‌ ఈటర్‌ చిక్కింది. జనాడా, కాంతాపేట్‌, చిరోలి, కరడేపేట్‌, చించాడా గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ.. ఇటీవల 15 రోజుల్లోనే నలుగురు పశువుల కాపరులను పొట్టన పెట్టుకుంది ఈ మ్యాన్‌ ఈటర్‌. దీంతో పశువుల కాపరులు, స్థానికులు రాత్రింబవళ్లు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మహా రాష్ట్ర అటవీశాఖ మంత్రి మునగంటివార్ ఆదేశాలతో పులిని పట్టుకునేందుకు రంగంలోకి‌ దిగిన అటవిశాఖ సిబ్బంది డ్రోన్‌ సాయంతో జనాడా గ్రామ పరిసర అడవుల్లో ఈ మ్యాన్‌ ఈటర్‌ను గుర్తించారు. షార్ప్‌ షూటర్‌ అజయ్‌ మరాఠీ సాయంతో పులికి మత్తుమందు ఇచ్చి బంధించారు. పులిని చంద్రపూర్‌ టైగర్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. దీంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..