Viral Video: ఇదేరా పోయేకాలం అంటే.. ఇంతకంటే పైత్యం ఏమైనా ఉంటుందా..
రీల్స్ పిచ్చ పీక్స్‌కి చేరింది. ప్రాణం అంటే భయం లేకుండా పోయింది. లైక్స్, వ్యూస్ మాయలో పడి యువత ఏం చేస్తున్నారో కూడా సోయి ఉండటం లేదు. తాజాగా ఈ పనిమంతులు ఏం చేశారో తెలుసుకుందాం పదండి...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతిఒక్కరికి రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ప్రాణాలకు సైతం తెగించి రీల్స్ చేస్తున్నారు. లైక్స్ కోసం లైఫ్‌ని రిస్క్‌లో పడేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు రోడ్డుమీద ఉండే సైన్ బోర్డుపైకి ఎక్కి పుల్‌అప్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
అమేఠీలోని జాతీయ రహదారి 931లో ఓ యువకుడు సైన్‌బోర్డు పైకి ఎక్కి పుల్ అప్స్ తీశాడు. నేల నుంచి 10 మీటర్లకు పైగా ఎత్తులో వేలాడుతూ స్టంట్లు చేశాడు. మరో యువకుడు కూడా పైకి ఎక్కి అతడిని వీడియో తీశాడు. ఏ మాత్రం పట్టు జారినా ప్రాణాలు ప్రమాదంలో పడేవి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ప్రాణాలు చాలా విలువైనవి.. రీల్స్ కోసం ఇలా తెగించడం సరికాదు అని ఒకరు.. ‘‘రీల్స్ కోసం ప్రమాదక స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసినా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదని మరొకరు.. రీల్స్ కోసం ఇలాంటి అనాలోచిత చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ కొందరు పోస్టులు పెట్టారు. దీనిపై స్థానిక పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇలాంటి స్టంట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#अमेठी:अमेठी की सड़कों पर खतरों के खिलाड़ी,किलोमीटर के सांकेतिक बोर्ड पर पुशअप करता नजर आया युवक,जान हथेली पर डालकर सड़क से 10 मीटर ऊपर बोर्ड पर पुशअप कर रहा युवक,सचिन नाम के इंस्टाग्राम आईडी से वीडियो किया गया है पोस्ट @amethipolice @DmAmethi pic.twitter.com/Qq5kCkgcCl
— AMETHI LIVE (@AmethiliveCom) September 29, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..