Viral: పెద్ద పులి, ఎలుగుబంటి మధ్య హోరాహోరీ ఫైట్.. చివరకు ఏది గెలిచిందంటే..?

తన బిడ్డ జోలికి వస్తే ఏ బలహీన జంతువు కూడా కూడా వదిలిపెట్టదు. ఆఖరికి పక్షి కూడా ఎదురుతిరుగుతుంది. అలాంటిది పులికి సమవుజ్జీ అయిన ఎలుగుబంటి ఊరుకుంటుందా..? పెద్ద పులికి సుస్సు పోయించింది... వీడియో వైరల్...

Viral: పెద్ద పులి, ఎలుగుబంటి మధ్య హోరాహోరీ ఫైట్.. చివరకు ఏది గెలిచిందంటే..?
Bear Vs Tiger (Representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 29, 2024 | 4:19 PM

పులి ఎంత ప్రమాదకరంగా వేటాడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి అపరిమితమైన శక్తితో పాటు చురుకుదనం కూడా ఉంటుంది. రాత్రి.. చీమ్మి చీకట్లో అయినా, మండే ఎడారి ప్రాంతాల్లోనైనా..  పులికి ఎప్పుడైనా ఎక్కడైనా వేటాడే సామర్థ్యం ఉంది. అందుకే పులి గాండ్రింపు వినిపిస్తే అడవిలోని మిగిలిన జంతువులు భయంతో వణుకుతాయి. మరి పులికి సమవుజ్జీ ఏది..? అందరూ సింహం పేరు చెబుతారు. అది నిజమే. అయితే పులి భయపడే జీవి మరొకటి ఉంది. అది ఎలుగుబంటి. అవును ఎలుగుబంటి తన పదునైన గోర్లతో.. పులి మెడపై అటాక్ చేస్తుంది. మిగతా ఏ భాగంలో గాయమైనా పులి నాకితే.. ఆ గాయం నయమవుతుంది. కానీ మెడపై గాయం అయితే.. మాత్రం నాకే అవకాశం ఉండదు కాబట్టి.. సెప్టిక్ అయి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అందుకే పులులు ఎలుగుబంట్ల జోలికి పోవు.

కానీ ఇక్కడ ఓ పులి ఎలుగుబంటితో హోరోహోరీ ఫైట్ చేసింది. తొలుత పులి ఎలుగుబంటి పిల్లను ఆహారంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది. కానీ వెంటనే అలర్టైన పిల్ల ఎలుగుబంటి తల్లి పులితో వార్‌కి దిగింది. ఆ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.  చంద్రాపూర్‌లోని తడోబా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అలా అడవిలో ఎలుగుబంటి పిల్ల ఆడుకుంటూ ఉండగా.. అదే సమయంలో ఆకలితో ఉన్న పులి దాన్ని అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇంతలో ఆ పిల్ల తల్లి అక్కడికి రావడంతో పులితో ఫైట్ మొదలైంది. మొదట, పులి కూడా ఎలుగుబంటిపై పై చేయి సాధించడానికి ప్రయత్నించింది. కానీ పిల్లను రక్షించడానికి తల్లి తన శక్తికి మించి..  పులితో పోరాడింది. దీంతో పులి తోకముడిచి అక్కడి నుంచి పారిపోయింది. అలా పారిపోతున్న పులిని కొంతదూరం వెంటాడింది ఎలుగుబంటి.

ఈ వన్యప్రాణుల పోరాటాన్ని ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో రికార్డు చేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లి ఎలుగుబంటిని అభినందిస్తున్నారు.  మీరు కూడా ఈ వీడియోపై అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..