AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెడ్ పై టైగర్..అస్సాంలో రేర్ సీన్ !

భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న అస్సాంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, గ్రామాలు రాజధానితో సంబంధాలను కోల్పోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర నదితో సహా ఇతర నదులు పరవళ్లు తొక్కుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. ఇంత బీభత్సంలోనూ ఓ వింత జరిగింది. కజిరంగ లోని నేషనల్ పార్కు నుంచి చిన్నా, చితకా జంతువులతో బాటు క్రూర మృగాలు కూడా మరణించడమో, నీటిలో కొట్టుకుపోవడమో చూసి వైల్డ్ లైఫ్ పార్క్ అధికారులు చలించిపోయారు. ఓ రాయల్ […]

బెడ్ పై టైగర్..అస్సాంలో రేర్ సీన్ !
Anil kumar poka
|

Updated on: Jul 18, 2019 | 5:31 PM

Share

భారీ వర్షాలు, వరదలతో సతమతమవుతున్న అస్సాంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, గ్రామాలు రాజధానితో సంబంధాలను కోల్పోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర నదితో సహా ఇతర నదులు పరవళ్లు తొక్కుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. ఇంత బీభత్సంలోనూ ఓ వింత జరిగింది. కజిరంగ లోని నేషనల్ పార్కు నుంచి చిన్నా, చితకా జంతువులతో బాటు క్రూర మృగాలు కూడా మరణించడమో, నీటిలో కొట్టుకుపోవడమో చూసి వైల్డ్ లైఫ్ పార్క్ అధికారులు చలించిపోయారు. ఓ రాయల్ బెంగాల్ టైగర్ వరదల్లో చిక్కుకుని ఎటూ పోలేక.. ఓ ఇంట్లో ప్రవేశించింది. నీటి కారణంగా దాదాపు కూలిపోయే స్థితిలో ఉన్న ఆ ఇంట్లోని గదిలో..బెడ్ పైకి చేరింది. ఇంటి యజమాని అది చూసి భయంతో అధికారులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకొని ఆ పులిని ట్రాంక్విలైజర్ తో స్పృహ కోల్పోయేలా చేశారు. ఆకలితో నకనకలాడుతూ ఆ బెడ్ పై అచేతనంగా చేరిన దాన్ని ఆ తరువాత రెస్క్యూ చేశారు. ఈ పులి గారి ‘ బెడ్ సీన్ ‘ ఫోటోను వైల్డ్ లైఫ్ పార్క్ సిబ్బంది ట్విటర్ లో షేర్ చేశారు.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి